Home » Warangal News
తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
డాడీ నేను ఇక డాన్స్ లేయలేనా ? అన్న కుమారుడి మాటలకు ఓ తండ్రి చలించిపోయి బోరున విలపించాడు. సోమవారం పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామ శివారులో పాఠశాల బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొంకపాక గ్రామానికి చెందిన రాజు కుమారుడు హర్షిత్ (10) తీవ్రంగా గాయపడ్డాడు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, సెంటిమెంట్‌ను రగిలించడం బీఆర్ఎస్ సిద్ధాంతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
గతంలో గంగిరెద్దుల ఆటలకు గ్రామాల్లో ఆదరణ ఉండేది. అయితే.. మారిన పరిస్థితుల నేపథ్యంలో... గ్రామాల్లో గంగిరెద్దుల ఆటలకు ఆదరణ కరువైపోచింది. ప్రస్తుతం ఎక్కడో ఒకచోట ఈ గంగిరెద్దుల వారు దర్శనమిస్తున్నారు. ప్రధానంగా సంక్రాంతి సమయాల్లో గంగిరెద్దుల విన్యాసాలు కనబడేవి.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా వరంగల్ కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గంగారం, కొత్తగూడ మండలాల్లో పులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
పంచాయతీ పోలింగ్ సమీపించడంతో అభ్యర్థు ల్లో టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులుగా సాధారణంగా కనిపించిన అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది.
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.
మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ చివరి దశలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎయిర్‌లైన్స్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని వివరించారు.