Home » Vizag News
విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఈ సెంటర్ సాగర నగరం వైజాగ్‌లో నిర్మాణం కానుంది.
ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.
విశాఖపట్నంలో కాల్పులు కలకలం రేపాయి. పాత కక్షల కారణంగా నాటు తుపాకీతో కాల్చడంతో రాజేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పుల జరిపిన వ్యక్తి సస్పెన్షన్‌లో ఉన్న కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు.
ఈసారి స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం కారణంగా ఆగస్టు 15 నుంచి 17 వరకు 3 రోజుల వీకెండ్ సెలవులు వచ్చాయి. టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లాలని చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. అయితే హైదరాబాద్ పరిధిలో ఉండే ఓ చక్కటి ప్లేస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Vizag Gas Cylinder Blast: పేలుడు ధాటికి చెక్క, రేకులతో కూడిన వెల్డింగ్ షాప్ తునాతునకలైంది. పక్కనున్న మరికొన్ని షాపులు కూడా బాగా దెబ్బతిన్నాయి. గణేష్, శ్రీను మంటల్లో పడి పూర్తిగా కాలి చనిపోయారు. ముత్యాలు కాలు విరిగిపోయి ఎగిరి దూరంగా పడిపోయింది.
విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట యువతను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని విశాఖపట్నం సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
విహార నౌకలతో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు.
పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకుని బంగ్లాదేశ్‌లో శనివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
విద్యుత్ చార్జీలను రూపాయి కూడా పెంచబోమని, మళ్లీ ఎన్నికలు జరిగేలోపు తగ్గించాలని ప్రయత్నిస్తున్నామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
విశాఖపట్నంలో మరో దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ అడుగుపెడుతోంది. తాము విశాఖకు వస్తున్నాం అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు గురువారం పెద్ద శుభవార్త చెప్పింది.