Home » Visakhapatnam
వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువచేసే 450 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో అక్రమంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం కైలాసగిరిలో ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలం ఏపీ వ్యాప్తంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా స్పందించారు.
వీఎంఆర్డీఏ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్‌పై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ విషయంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
కైలాసగిరిపై ఢమరుకంతో కూడిన భారీ త్రిశూలం ప్రాజెక్ట్ ప్రారంభమైంది. విశాఖ నగరంలో ఎక్కడ నుంచి కైలాసగిరి వైపు చూసిన కనిపించేలా 65 అడుగుల ఎత్తులో త్రిశూలంను ఏర్పాటు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రైల్వేజోన్ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదని ప్రశ్నించారు.
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’ నిర్వహించారు. గురువారం ఉదయం విశాఖ బీచ్ రోడ్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి భారీ సంఖ్యలో కార్లు, బైక్‌లతో ర్యాలీని ప్రారంభించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
కైలాసగిరిపై నిర్మించిన త్రిశూలం, ఢమరుకాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ మంగళవారం ప్రకటించారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్‌భరత్, సీఈ వినయకుమార్, ఇతర అధికారులతో కలిసి కైలాసగిరిని సందర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెంచాలన్న సర్కారు లక్ష్యానికి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. తమ వద్ద చదువుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధమైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.