Home » Virat Kohli
టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏ పని చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. విరాట్‌కు ఓ అలవాటు ఉంది.. తోటి ఆటగాళ్లను ఎప్పుడూ ఆటపట్టిస్తూ వాళ్లను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. తాజాగా విరాట్.. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రన్నింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించి సులభమైన ఫార్మాట్‌ను ఎంచుకుని ఆడుతున్నాడని మండిపడ్డాడు.
ఇంగ్లాండ్ లెజెండరీ బౌలర్ జేమ్స్ అండర్సన్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీతో సాగించిన పోరాటం అత్యంత చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా.. భారత్ నుంచి కోహ్లీ తన ఫేవరెట్ ప్లయర్ అని అండర్సన్ వెల్లడించారు.
బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్ తరఫున హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరసన ఓ అరుదైన జాబితాలోకి చేరాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐకి ఓ సూచన చేశాడు. రో-కో ఉన్నన్ని రోజులు వన్డే సిరీస్‌లు పెంచాలని అన్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని 2026 సంవత్సరంలో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అతడు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటి...2025ను ఘనంగా ముగించాడు.
కొత్త ఏడాది వేళ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లీ గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాలా రోజుల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.
ఈ సంవత్సారికి గానూ తన దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్, బ్యాటర్ ఎవరో టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అని ప్రశంసించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. అయితే నేడు జరుగుతున్న మూడో రౌండ్‌కు వీరిద్దరూ అందుబాటులో లేరు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రోహిత్ ముంబై తరఫున ఆడబోడు. కారణాలు ఏంటంటే..?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.