Indian Cricket: కోహ్లీ, రోహిత్ సైడవ్వాల్సిందేనా
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:00 AM
ఇంగ్లండ్‌తో హోరాహోరీగా సాగిన ఐదు టెస్టుల సిరీస్ 2 2తో సమంగా ముగిసింది. అయితే, సుదీర్ఘంగా
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో హోరాహోరీగా సాగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. అయితే, సుదీర్ఘంగా సాగిన సిరీ్‌సలో భారత యువ ఆటగాళ్ల పోరాటం హైలైట్‌గా నిలిచింది. దీంతో భారత జట్టులో వీరి స్థానాలు ఇక పదిలమేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది. యువ కెరటాలు అనూహ్యంగా దూసుకురావడంతో.. వన్డేలు మాత్రమే ఆడాలనుకొంటున్న సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీలకు దారులు క్రమంగా మూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. రాబోయే వరల్డ్‌క్‌పనకు వీరిద్దరూ దాదాపుగా 40 ఏళ్లకు చేరువవుతుండడంతో.. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని యువకులతో కోర్ టీమ్ తయారుచేయాలన్న నిర్ణయానికి బీసీసీఐ వచ్చిందని సమాచారం. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై బోర్డు కొద్దిరోజుల్లోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.