Virat Kohli-Rohit Sharma: రోహిత్, కోహ్లీ స్థానాలు గల్లంతు.. షాకిస్తున్న ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్..
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:52 PM
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ-20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఇప్పటికే అంతర్జాతీయ టీ-20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఐసీసీ (ICC) వారం రోజుల క్రితం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఏకంగా రెండో స్థానం దక్కించుకోగా, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే వారం రోజులు తిరిగే సరికి సీన్ మారిపోయింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మాత్రం వీరిద్దరికీ స్థానం దక్కలేదు (ICC ODI batting rankings).
ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల లిస్ట్‌లో గత వారం మాదిరిగానే తాజాగా కూడా శుభ్‌మన్ గిల్ (784 పాయింట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. గత వారం రోహిత్ శర్మ 756 పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు ఐసీసీ ప్రకటించింది. అయితే తాజాగా రోహిత్ శర్మ పేరును పూర్తిగా తొలగించి గత వారం మూడో స్థానంలో ఉన్న పాక్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌ను తాజాగా రెండో స్థానానికి ప్రమోట్ చేసింది. ఇక, గత వారం 736 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ పేరు కూడా తాజాగా గల్లంతైంది.
తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటర్ల లిస్ట్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే టాప్ టెన్‌లో ఉన్నారు. ఇలా హఠాత్తుగా కోహ్లీ, రోహిత్ పేర్లు మిస్ అవడం చాలా మందికి అంతుపట్టడం లేదు. ఏదైనా సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని చాలా మంది భావిస్తున్నారు. టెస్ట్‌లకు, టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్.. వన్డేల నుంచి కూడా వైదొలిగారని ఐసీసీ భావిస్తోందేమో అని కొందరు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం
India Women Cricket: ప్రపంచకప్ జట్టులో శ్రీచరణి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..