Share News

India Women Cricket: ప్రపంచకప్‌ జట్టులో శ్రీచరణి

ABN , Publish Date - Aug 20 , 2025 | 03:00 AM

ఇంగ్లండ్‌ టూర్‌లో ఆకట్టుకొన్న తెలుగమ్మాయి శ్రీచరణికి జాక్‌పాట్‌ తగిలింది. మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ జట్టులో ఆమెకు చోటుదక్కింది. ఫిట్‌నెస్‌ సాధించిన పేసర్‌ రేణుక సింగ్‌ జట్టులోకి పునరాగమనం...

India Women Cricket: ప్రపంచకప్‌ జట్టులో శ్రీచరణి

రేణుక రీఎంట్రీ ఫ షఫాలీకి మొండిచేయి ఫ టీమిండియా ఎంపిక

ముంబై: ఇంగ్లండ్‌ టూర్‌లో ఆకట్టుకొన్న తెలుగమ్మాయి శ్రీచరణికి జాక్‌పాట్‌ తగిలింది. మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ జట్టులో ఆమెకు చోటుదక్కింది. ఫిట్‌నెస్‌ సాధించిన పేసర్‌ రేణుక సింగ్‌ జట్టులోకి పునరాగమనం చేసింది. టాపార్డర్‌లో ప్రతికా రావల్‌కు చాన్స్‌ దక్కగా.. షషాలీకి సెలెక్టర్లు మొండిచేయి చూపారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరించనున్నారు. భారత్‌, శ్రీలంకల్లో వచ్చే నెల 30 నుంచి వరల్డ్‌కప్‌ జరగనుంది. కాగా ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీ్‌సలో 10 వికెట్లు పడగొట్టిన కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీ్‌సగానూ ఎంపికైంది. కాగా, మెగా టోర్నీకి ముందు.. అంటే సెప్టెంబరు 14 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడువన్డేల సిరీస్‌ కోసం కూడా భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఇంగ్లండ్‌ పర్యటనలో ఆడిన జట్టును దాదాపుగా ప్రపంచక్‌పనకు ఎంపిక చేశారు. ఒక్క మార్పు మినహా విశ్వకప్‌ జట్టునే ఈ సిరీ్‌సకూ ఖరారు చేశారు. ఆల్‌రౌండర్‌ అమన్‌జోత్‌ కౌర్‌ స్థానంలో ఆసీస్‌తో వన్డేలకు సయాలీ సత్‌ఘరేను తీసుకొన్నారు. గాయంతో బాధపడుతున్న అమన్‌జోత్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసంలో ఉంది. ప్రపంచకప్‌ సమయానికి ఆమె కోలుకొనే అవకాశం ఉంది. యువ సీమర్‌ క్రాంతి గౌడ్‌, అరుంధతిలకు కూడా టీమ్‌లో చోటు లభించింది. శ్రీచరణితోపాటు దీప్తి శర్మ, రాధా యాదవ్‌, స్నేహ్‌ రాణాలతో స్పిన్‌ విభాగం బలంగా కనిపిస్తోంది.

భారత మహిళల వరల్డ్‌కప్‌ జట్టు

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతికా రావల్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, రేణుక సింగ్‌ ఠాకూర్‌, అరుంధతి, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), క్రాంతి గౌడ్‌, అమన్‌జోత్‌ కౌర్‌, రాధా యాదవ్‌, శ్రీచరణి, యాస్తిక భాటియా (వికెట్‌ కీపర్‌), స్నేహ్‌ రాణా.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు

నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి

Read Latest AP News and National News

Updated Date - Aug 20 , 2025 | 03:00 AM