Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:58 AM
భారత స్టార్ షూటర్ మను భాకర్ ఆసియా చాంపియన్‌షి్‌పలో పతకం సాధించింది. సీనియర్ విభాగం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్‌లో 219.7 పాయింట్లు స్కోరు చేసిన మను...
ఆసియా షూటింగ్
షిమ్‌కెంట్ (కజకిస్థాన్): భారత స్టార్ షూటర్ మను భాకర్ ఆసియా చాంపియన్‌షి్‌పలో పతకం సాధించింది. సీనియర్ విభాగం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్‌లో 219.7 పాయింట్లు స్కోరు చేసిన మను.. మూడోస్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. ఇక, ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో పాలక్, సురుచి సింగ్‌లతో కలిసి మను భాకర్ కాంస్యం నెగ్గి రెండో పతకం ఖాతాలో వేసుకుంది. అలాగే జూనియర్ బాలికల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో భారత అమ్మాయి రష్మి సాగల్ స్వర్ణం కొల్లగొట్టింది. ఇదే విభాగం టీమ్ ఈవెంట్‌లోనూ రష్మిక.. వంశిక, మోహినిలతో కలిసి పసిడి నెగ్గి గోల్డెన్ డబుల్ సాధించింది. కాగా, యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కనక్ స్వర్ణం, ఆగమ్ గ్రేవాల్ రజతం నెగ్గారు. ఇక, టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు పసిడి సాధించింది. జూనియర్ బాలుర ఎయిర్ పిస్టల్‌లో గవిన్ కాంస్యం అందుకోగా.. యూత్ పురుషుల ఎయిర్ పిస్టల్‌లో గిరీష్ స్వర్ణం, దేవ్ ప్రతాప్ కాంస్యం గెలిచారు. ఇక, యూత్ పురుషుల టీమ్ ఈవెంట్‌లోనూ భారత జట్టు పసిడి సాధించడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News