Virat Kohli-Anushka Sharma: లండన్ వీధుల్లో విరుష్క జోడీ.. స్థానికులతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి..
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:21 PM
ఐపీఎల్ తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు లేకపోవడంతో కోహ్లీ లండన్‌లోనే ఉంటున్నాడు. అక్కడే క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కుటుంబంతో కలిసి లండన్ (London)లో స్థిరపడిన సంగతి తెలిసిందే. కేవలం క్రికెట్ ఆడుతున్నప్పుడు మాత్రమే కోహ్లీ ఇండియాకు వస్తున్నాడు. కోహ్లీ పిల్లలు, భార్య అనుష్క (Anushka Sharma) మాత్రం లండన్‌లోనే ఉంటున్నారు. ఐపీఎల్ (IPL) తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు లేకపోవడంతో కోహ్లీ లండన్‌లోనే ఉంటున్నాడు. అక్కడే క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు.
స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా సామాన్యుడిలా జీవించడం కోసమే కోహ్లీ లండన్‌కు తన మకాం మార్చాడు. తను కోరుకున్నట్టుగానే అక్కడ జీవిస్తున్నాడు. కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోహ్లీ కేవలం టీషర్ట్, షార్ట్ మాత్రమే వేసుకున్నాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ కనబడిన వారితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ తర్వాత కోహ్లీ మళ్లీ క్రికెట్ మైదానంలో కనిపించలేదు. టీ-20లు, టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం టీమిండియా తరఫున వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా భారత్, ఆసీస్ జట్ల మధ్య అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు.
ఇవి కూడా చదవండి
జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి