Home » Vijayawada
మచిలీపట్నంలో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు కొండపల్లి స్టేషన్‌లో హాల్ట్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.
కాంట్రాక్టర్ల అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సమస్యలను పరిష్కరించటానికి వీలుగా గడువు పెంచవచ్చు. ఏ సమస్యా లేకుండా సీఆర్డీఏ అధికారులు ఎందుకు గడువు పొడిగిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి..
విజయవాడ నుంచి ఔరంగాబాద్‌కు వయా హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ ఆటకట్టించారు సెంట్రల్‌జోన్ పోలీసులు. ఓ మహిళతో పాటు మరో స్మగ్లర్‌ను దోమలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి, గుణదల కొండ, గాంధీ కొండ వంటి భారీ కొండ సాణువులు సైతం రాతి, మట్టి కలబోతతో కూడి ఉంటాయి. ఇలాంటి కొండలు జనావాసాలకు సురక్షిత ప్రాంతాలు కావు. దీంతో భారీ వర్షాల సమయంలోనూ, ముసురుపట్టినప్పుడు, కొండలపై మట్టి నాని రాళ్లు బయట పడుతున్నాయి..
Heavy Rains In Vijayawada: విజయవాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నది, బుడమేరు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు.
వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అయితే, ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసం పూర్తయ్యేవరకూ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు.
వందే భారత్ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.
AP Police Vs Jagan: వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని.. అరెస్ట్‌లు చేశామని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు.