AI Health Strategy: విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ఏఐ హెల్త్ స్ట్రాటజీ వర్క్‌షాప్
ABN , Publish Date - Dec 15 , 2025 | 08:42 PM
భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏఐ హెల్త్ స్ట్రాటజీ డ్రాఫ్ట్ తయారీకి జోనల్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా ఫిబ్రవరి 2026లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో డ్రాఫ్ట్ ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలో..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 15: విజయవాడలో రీజినల్ మల్టీ స్టేక్‌హోల్డర్స్ కన్వర్జన్స్ వర్క్‌షాప్ ఆన్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఫర్ హెల్త్ (NAISH) అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR), కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశాయి.
తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌ఘడ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాల నుంచి వైద్య ఆరోగ్య, ఐటీ శాఖల ముఖ్య అధికారులు ఈ ఒకరోజు సదస్సుకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న భారీ హెల్త్ డేటాను ఆధారంగా చేసుకుని కృత్రిమ మేధ (AI)ను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇది ప్రివెంటివ్ కేర్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, ప్రాంతాలవారీగా రోగాల తీవ్రత అంచనా, వైద్య సేవల మెరుగుదలకు దోహదపడుతుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, హెల్త్ రికార్డ్స్ డిజిటలైజేషన్‌లో ఏపీ ముందుంజలో ఉందని, ఎమర్జింగ్ టెక్నాలజీలు (AI/ML/LLM)లో రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలనే సంకల్పంతో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే 'సంజీవిని' పథకం ద్వారా కుప్పం నియోజకవర్గంలో కంటిన్యూస్ కేర్ సేవలు అందిస్తున్నామని, వాట్సప్ గవర్నెన్స్‌లో 'మనమిత్ర' ద్వారా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలు జనరేట్ చేసుకోవడం సులభతరం చేశామని వెల్లడించారు.
కాగా, కేంద్రం జాతీయ స్థాయిలో ఏఐ హెల్త్ స్ట్రాటజీ డ్రాఫ్ట్ తయారీకి జోనల్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ఈ చర్చలను నివేదికగా సమర్పించి, ఫిబ్రవరి 2026లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో డ్రాఫ్ట్ ఖరారు చేయనున్నారు. దీని ఆధారంగా రాష్ట్రాలు సొంత వ్యూహాలు రూపొందిస్తాయి. ఈ సదస్సు ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కీలకం కానుంది.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..