Home » Venezuela
ఈ రోజు (గురువారం) మరోసారి డెల్సీ రోడ్రిగ్జ్ భూకంపాలపై ప్రకటన చేశారు. మృతుల సంఖ్య 164కు చేరిందని తెలిపారు. 971 మంది గాయపడినట్లు వెల్లడించారు.
వెనెజువెలా దేశంలో బుధవారం రాత్రి పెను భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు శక్తిమంతమైన భూకంపాల ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. కాగా.. ఈ ప్రమాదం సంభవించడానికి కొన్ని క్షణాల ముందు గూగుల్ పలు స్మార్ట్‌ఫోన్లకు దీని గురించి అలర్ట్‌లు పంపిందని తాజాగా తెలుస్తోంది.
దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు వణికించాయి. శక్తిమంతమైన ప్రకంపనలతో రాజధాని కారకస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి.
వెనెజువెలాలో ఒక నిమిషం వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే ప్రకారం మొదట 7.2 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.
రష్యా ముడి చమురుకు బదులు వెనెజువెలా నుంచి దిగుమతులు ప్రారంభించాలని భారత్‌కు అమెరికా సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.
మదురో అరెస్టు తరువాత తమకు అమెరికా దళాలు కేవలం 15 నిమిషాలే టైమిచ్చి తదుపరి చర్యపై నిర్ణయం తీసుకోమని బెదిరించాయని వెనెజువెలా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ చెప్పినట్టు ఉన్న ఆడియో రికార్డింగ్ ఆ దేశంలో కలకలం రేపుతోంది. అమెరికాకు, డెల్సీకి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న వార్తల నడుమ ఈ పరిణామానికి అమిత ప్రాధాన్యం ఏర్పడింది.
మా ముక్కుల నుంచి రక్తం కారింది. కొందరు వాంతులు చేసుకున్నారు. చాలా మంది కింద పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మే నిలబడలేకపోయాం. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే.. నికోలస్ మదురో దగ్గర గార్డ్‌గా పని చేసిన ఓ వ్యక్తి మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.
వెనెజువెలా నుంచి అక్రమంగా ముడిచమురును తరలిస్తున్న మరో ఆయిల్ ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా సైన్యం తాజాగా పేర్కొంది. కరీబియన్ సముద్ర జలాల్లో నౌకను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.
వెనెజువెలా ఆపద్ధర్మ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ అమెరికా తీరును ఎండగట్టారు. దురాశతో అమెరికా తమ దేశ వనరులపై దృష్టి సారించిందని పార్లమెంటును ఉద్దేశించి తాజాగా వ్యాఖ్యానించారు.
గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఎం/వీ బెల్లా-1 నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మెహరించింది.