Share News

వెనెజువెలాలో రెండు భూకంపాలు.. 164కి చేరిన మృతుల సంఖ్య..

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:38 PM

ఈ రోజు (గురువారం) మరోసారి డెల్సీ రోడ్రిగ్జ్ భూకంపాలపై ప్రకటన చేశారు. మృతుల సంఖ్య 164కు చేరిందని తెలిపారు. 971 మంది గాయపడినట్లు వెల్లడించారు.

వెనెజువెలాలో రెండు భూకంపాలు.. 164కి చేరిన మృతుల సంఖ్య..
Venezuela earthquake

ఇంటర్‌నెట్ డెస్క్: వెనెజువెలా రాజధాని కరాకస్‌తో పాటు పరిసర ప్రాంతాలలో బుధవారం సాయంత్రం వరుసగా రెండు సార్లు భూకంపాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక నిమిషం తేడాతో 7.2.. 7.5 మాగ్నిట్యూడ్‌తో భూకంపాలు వచ్చాయి. దీంతో పలు భవనాలు దెబ్బతినగా, మరి కొన్ని పూర్తిగా కూలిపోయాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య గురువారం మధ్యాహ్నం నాటికి 164కి చేరింది. బుధవారం రాత్రి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భూప్రకంపనల కారణంగా కారణంగా 32 మంది చనిపోయినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.


విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ రోజు (గురువారం) మరోసారి డెల్సీ రోడ్రిగ్జ్ భూకంపాలపై ప్రకటన చేశారు. మృతుల సంఖ్య 164కు చేరిందని తెలిపారు. 971 మంది గాయపడినట్లు వెల్లడించారు. లా గువైరాలో 700 మంది గాయపడినట్లు ఆమె తెలిపారు. అక్కడ డజన్ల కొద్దీ బిల్డింగ్‌లు నేలమట్టం అయినట్లు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి

Updated Date - Jun 25 , 2026 | 05:05 PM