తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:36 PM
తెలంగాణ విద్యాశాఖ టెన్త్ సప్లిమెంటరీ 2026 ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ టెన్త్ సప్లిమెంటరీ 2026 ఫలితాలను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 31,542 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు చెక్ చేసుకునే విధానం:
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కనిపించే SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
వివరాలు నమోదు చేశాక 'సబ్మిట్' లేదా 'గెట్ రిజల్ట్స్' బటన్‌పై క్లిక్ చేయాలి.
మీ స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ (Print out) తీసుకోవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read:
టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
వెనెజువెలా భూకంపాన్ని ముందే హెచ్చరించిన స్మార్ట్ ఫోన్లు!