Share News

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:11 PM

తెలంగాణలో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు శుభవార్త. టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
TG LAWCET 2026 Counselling

హైదరాబాద్: తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG LAWCET-2026), తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGLCET-2026) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జూన్ 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


టీజీ లాసెట్‌ 2026

టీజీ లాసెట్‌-2026 అభ్యర్థులు జూలై 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అనంతరం జూలై 16 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. సీట్ల కేటాయింపు జూలై 24న చేపట్టనుండగా, ఎంపికైన అభ్యర్థులు జూలై 25 నుంచి 28వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.


పీజీఎల్‌సెట్‌-2026

ఇక పీజీఎల్‌సెట్‌-2026 అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేపట్టనుండగా, ఆగస్టు 5న సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి 8వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. న్యాయ విద్యలో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు కౌన్సెలింగ్ తేదీలను గమనించి, నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.


Also Read:

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..

ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట

Updated Date - Jun 25 , 2026 | 04:19 PM