పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:37 PM
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీ స్పందించారు. కార్తికేయపై చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ స్పందించారు. కార్తికేయపై చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించినవి కావని తెలిపారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రమోద్ కుమార్ అగర్వాల్ విచారణ చేపట్టనున్నారు.
ఏమిటీ కేసు..
2018లో జాభువాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ పనామా పేపర్ లిక్స్ అంశాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ కార్తికేయ సింగ్ ప్రస్తావన కూడా తేవడంతో ఆయన భోపాల్‌లో ఎమ్మెల్యే-ఎంపీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల తన పరువు దెబ్బతిందని ఆరోపించారు. దీంతో, విచారణకు హాజరు కావాలంటూ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అయితే, రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లతో పాటు తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ తాజాగా మరో అప్లికేషన్ దాఖలు చేశారు.
కాగా, రాహుల్ గాంధీ తాజా పిటిషన్‌పై బీజేపీ ఐటీ సెల్ విమర్శలు వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ ఇప్పటికి ఎన్నో సార్లు ఇలాంటి క్షమాపణలు చెప్పారని కామెంట్ చేసింది. రాహుల్ గాంధీ అసలు కార్తికేయ పేరును ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఆధారాలు లేకుండా ఇలాంటి కామెంట్స్ చేస్తే రాహుల్ విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతాయని విమర్శించింది.
ఈ వార్తలనూ చదవండి:
వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..
తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..