వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..
ABN , Publish Date - Jun 25 , 2026 | 02:45 PM
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేతన్‌ను హత్య చేయటం కోసం సియా, చేతన్‌లు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎన్ని రకాలుగా హత్య చేయవచ్చో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి.. జూన్ 18వ తేదీన నిందితులు మర్డర్ ప్లాన్‌ను అమలు చేశారు. లోహగడ్ కోట వద్ద కేతన్‌ను లోయలోకి తోసి చంపేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఇద్దరు నిందితులు 2004 ఫోన్ కాల్స్ చేసుకున్నట్లు ఫోరెన్సిక్ విచారణలో బయటపడింది. ఆరు నెలల కాలంలో సియా, చేతన్ ఏకంగా 238 గంటల పాటు మాట్లాడుకున్నారు. పుణె ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మీడియాతో కేసు గురించి మాట్లాడుతూ.. ‘కేతన్‌ను చంపడానికి నిందితులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. వారి డిజిటల్ ఫుట్‌ప్రింట్, ఇంటర్‌నెట్ సెర్చ్ హిస్టరీ, కమ్యూనికేషన్ రికార్డ్స్ కీలక ఆధారాలుగా మారాయి. నిందితులు ఇద్దరూ ప్రతీరోజు సాధారణ కాల్స్, వాట్సాప్ కాల్స్, ఫేస్‌టైమ్ ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించారు. ఇదే వారిపై అనుమానం కలిగేలా చేసింది’..
‘హత్య జరిగిన రోజు.. లోహగడ్ కోటకు వెళ్లేముందు నిందితులు ఇద్దరూ ఓ కేఫ్‌లో కలుసుకున్నారు. కేతన్ మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్నారు. ఆరు నెలల కాలంలో ఇద్దరూ కొన్ని వందల ఫోన్ కాల్స్ చేసుకున్నారు. వాటిలో గంటల తరబడి మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ అనాలసిస్‌లో బయటపడ్డ విషయాలను బట్టి.. హత్య కోసం నిందితులు పక్కాగా.. చాలా రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారని అర్థం అయిపోయింది’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ప్రపంచంలో అత్యధికంగా తినే పండు ఏమిటో తెలుసా?
నేరేడు పళ్లు విరగ కాస్తున్నాయి.. ఇది కరువుకు సంకేతమా..