Home » Tirumala
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక అనేకమంది రాజుల, రాణుల పాత్ర ఉంది. దీపాల వెలుగుల మొదలు స్వామికి సమర్పించే పూలూ, నైవేద్యం దాకా లోటు లేకుండా కొనసాగడానికి వెయ్యేళ్లుగా ఎందరో చేసిన దానధర్మాలే కారణం.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంటారు.
ప్రపంచంలో 197 దేశాలుంటే 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో లభించింది. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే రూ.201,65,97,829 విదేశీ కాయిన్స్, నోట్లు అందాయి.
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్‌అదాలత్‌లో రాజీ కుదిర్చిన కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటి అధికారులు, పాలకుల గుండెల్లో గుబులు మొదలైంది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ శోభాయమానంగా దర్శనమిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన..
బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, గదులు రద్దు చేశామని.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో వివరించారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులకు 1.16 లక్షల రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను భక్తులకు విక్రయించామని తెలిపారు.
టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచులపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం సాయంత్రం ఆయన తనిఖీలు చేపట్టారు.
టీటీడీ సమావేశంలో పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి నిధులతో పలు ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.