Share News

Srivari Parakamani Money Theft Case: పరకామణి చోరీ కేసు సాక్షి సతీష్‌ దారుణ హత్య..!

ABN , Publish Date - Nov 14 , 2025 | 06:06 PM

కలియుగ వైకుంఠ దేవుడు తిరుమల శ్రీవారి పరకామణిలో సొమ్ము అపహరించిన కేసులో కీలక సాక్షి సతీష్ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత పట్టాభి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

Srivari Parakamani Money Theft Case: పరకామణి చోరీ కేసు సాక్షి సతీష్‌ దారుణ హత్య..!
Srivari Parakamani money theft case

అమరావతి, నవంబర్ 14: తిరుమల శ్రీవారి పరకామణిలో దొంగతనం చేస్తుండగా రవికుమార్‌ను పట్టుకున్న సతీష్‌ ప్రాణాలు కోల్పోయారు. సతీష్ మృతిపై టీడీపీ సీనియర్ నేత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన కామెంట్స్ చేశారు. పరకామణిలో దొంగతనం జరుగుతుండగా రవికుమార్‌ను పట్టుకున్న సతీష్‌ను హత్య చేశారని ఆయన ఆరోపించారు.

police-2.jpg


'తాడిపత్రి వద్ద సతీష్ విగతజీవిగా పడి ఉన్నాడు. అత్యంత దారుణంగా సతీష్ కుమార్ హత్య గావింపపడ్డాడు. ఈ పరకామణి చోరీ అంశంలో వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వారు చైర్మన్‌లుగా ఉన్న సమయంలో చోరీ, రాజీ జరిగింది. సుబ్బారెడ్డి హయాంలో టీటీడీలో ప్రత్యేకంగా రవికుమార్‌ను రక్షించేందుకు తీర్మానం చేశారు. ఆగష్టు 2023లో కరుణాకర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నెల రోజులకే సెప్టెంబరులో లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చారు. రవికుమార్, సతీష్ కుమార్‌లు ఇద్దరూ సంతకాలు చేశారు' అని పట్టాభి ఆరోపించారు.

police-4.jpg


'భూమన కరుణాకర్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వైసీపీ దొంగల ముఠా కలిసి సతీష్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. సతీష్ కుమార్ సిట్ ముందు హాజరై స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉంది. అతని నుంచి రిపోర్ట్ రికార్డు చేస్తే వారి బండారం బయట పడుతుంది. ఏదో విధంగా ఈ కేసు నుంచి తప్పుకునేందుకు వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి .. సతీష్ ను పొట్టన పెట్టుకున్నారు. అప్పుడే వారి దిక్కుమాలిన ఛానల్‌లో అబద్దాలు ప్రచారం చేశారు. సిట్ ఒత్తిడి వల్ల సతీష్ ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. ఇది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనుకున్నారా?. గొడ్డలితో చంపి... గుండె పోటని బాబాయి మీద అబద్దాలు ప్రచారం చేసిన చరిత్ర మీది. సతీష్ ను కూడా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు.

సతీష్ ది హత్య కాదు.. ఆత్మహత్యని కరుణాకర్ రెడ్డి ఎలా చెబుతారు?. ఇప్పటికే ఒకసారి సతీష్ సిట్ ముందు హాజరై వివరాలు చెప్పాడు. మళ్లీ రెండోసారి విచారణ కు వెళుతుండటంతో .. వారికి భయం పట్టుకుంది. విచారణకు బయలుదేరాడని తెలిసే కిరాతకంగా హత్య చేయించారు. గతంలో ఎన్నో కేసుల్లో కీలకమైన సాక్ష్యులను మీరు చంపలేదా?. పరిటాల రవి కేసులో.. మొద్దు శ్రీను, ఓం ప్రకాష్ రెడ్డిని.. వివేకానంద హత్య కేసులోనూ ఎంతమందిని చంపారో మీకు గుర్తు లేదా?. మీ చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసు.. కరుణాకర్ రెడ్డి ప్లాన్ ప్రకారం సతీష్ ను హత్య చేయించారు. తాడిపత్రి నుంచి విచారణకు వెళుతున్నాడని తెలుసుకుని వెంటాడి చంపారు.' అని పట్టాభి ఆరోపణలు చేశారు.

police-3.jpg


'ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, పోలీస్ అధికారి అయిన సతీష్ కుమార్ తాడిపత్రి నుంచి విచారణకు వెళుతున్నాడని తెలుసుకుని వెంటాడి చంపారు. విజిలెన్స్ అధికారి గిరిధర్ రావు కూడా ఇటీవలి పరకామణి కేసుపై వివరణ ఇచ్చారు. లోక్ అదాలత్ లో ఎందుకు రాజీకి ఒప్పుకున్నావని సతీష్ ని అడిగారు. నాపై ఉన్నతాధికారులు‌ ఒత్తిడి తేవడం వల్ల రాజీకి వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. టీటీడీకి ఆస్తులు రాసిచ్చినట్లు నటించి రాజీ చేశారు. కోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిట్ ... సతీష్ ను విచారణ చేస్తుంది. ఎవరి ఒత్తిడితో రాజీ చేసుకున్నాడో నేడు సతీష్ స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఆ విషయంలో కరుణాకర్ రెడ్డి తనను బెదిరించాడని సతీష్ కుమార్... గిరిధర్ రావుకు చెప్పినట్లు నివేదిక రాశారు. ఇదే విషయం సిట్ ముందు చెబితే వారి ఖేల్ ఖతం అవుతుందని భయపడ్డారు. కరుణాకర్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి కలిసి సతీష్ ను హత్య చేశారు. అతని ముఖంపై బండ రాళ్లతో కొట్టినట్లు , గాయాలు ఉన్నట్లు సమాచారం వస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వాస్తవాలు బయటకు వస్తాయి.

సతీష్‌ను ముమ్మాటికీ చంపేశారు.. సతీష్ కు భయం ఉంటే‌‌‌... గతంలోనే విచారణకు వచ్చే వారు కాదు. ఇప్పుడు సిట్ కార్యాలయానికి సతీష్ చేరితే వారి పాపం పండుతుందని భయపడి చంపేశారు. కల్తీ నెయ్యి పాపం బట్ట బయలు అయ్యింది.. ఇప్పుడు ఈ బాగోతం‌ కూడా బయటకు వచ్చేది. వారి హత్యా రాజకీయాలు ఒక్కసారి చూడండి. అనేక కేసుల్లో సాక్షులుగా ఉన్న వారిని దారుణంగా చంపేశారు. ఇదే పంధాలో సతీష్ కుమార్ నూ హత్య చేశారు. ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకోవాలి. పోలీసులు హత్య కోణంలో కేసు విచారణ చేయాలి. వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటుతో చంపి, గుండె పోటు డ్రామాలు ఆడారు. జగన్ బాబాయికే ఈ గతి పట్టిస్తే.. సతీష్ కుమార్ వాళ్లకు ఒక లెక్కా. మీ‌ పాపాలు‌ పండాయి.. దేవుడు శిక్షిస్తాడు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి' అని పట్టాభి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


police 1.jpgఇవి కూడా చదవండి..

ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..

బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 14 , 2025 | 06:55 PM