Home » TG Politics
నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. భారీస్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానించామని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
గట్టు ఎత్తిపోతల పథకాన్ని నానబెట్టి నీళ్లివ్వని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు. తాను ఇక్కడికి వస్తుంటే ఓ నాయకుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాయిని చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు.
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.
మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇవ్వనని.. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదని మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు.
42శాతం బీసీ రిజర్వేషన్లతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు. కామారెడ్డి బీసీ విజయోత్సవ బహిరంగ సభ విజయవంతం కోసం జనసమీకరణ ఏర్పాట్లపై చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.