Home » TG Govt
తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మలేషియా కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేలా ముందుకు రావాలని సూచించారు.
ఇసుక ఆదాయం పెంపుపై టీజీఎండీసీ అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సర్ అధికారులతో మంత్రి సీతక్క ఈరోజు(శనివారం) సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారిత సాధించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. దాని కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో స్త్రీ రైడ్స్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.
కేసీఆర్ హయాంలో నిరంకుశ వైఖరితో వ్యవహరించారని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.