Home » Telangana Police
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు చేశారు దుండగులు. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు దుండగులు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంపై తనకు పూర్తి అవగాహన ఉందని డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీస్ విభాగంలో అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.
తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి తెలంగాణ డీజీపీ జితేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు డీజీపీ. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ నళినిని కలిశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వివరించారు కలెక్టర్.
మాజీ డీఎస్పీ నళిని సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్‌లో సంచలన పోస్టు చేశారు. తన అనారోగ్యంపై మరణ వాంగ్మూలం అంటూ ఆమె పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల తనకు నిలువెల్లా గాయాలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గాజులరామారంలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ సర్వేనెంబర్ - 307లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమంగా రూ. 8.71 లక్షలు దోచుకున్న కేసులో ఏడుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాత తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట శనివారం లొంగిపోయారు. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు సుజాత.
కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. రేణు అగర్వాల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.