Home » Telangana Phone Tapping Case
మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మాజీ సీఎంకు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాస సిబ్బందికి నోటీసులు అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని తెలిపారు..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో పలు అంశాలను ప్రస్తావించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటకిరాగా.. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది..