Home » TDP
ఎవరి ప్రభుత్వంలో ఏం చేశారు అనేది చర్చలో తేలుద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. యూరియా, పంటలకు గిట్టుబాటు ధరలపై బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలు అయినా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అని అచ్చెన్న స్పష్టం చేశారు.
నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా దిగిపోయిన చరిత్ర హీనుడు జగన్మోహనరెడ్డి ఒక్కడేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
జిల్లా ఎస్పీగా వి. రత్న సేవలు మరువలేనివని మాజీ మం త్రి పల్లె రఘునాథ రెడ్డి కొనియాడారు. జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళుతున్న ఎస్పీ రత్నకి మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎస్పీ క్యాంపు కార్యాలయలో బాబా చిత్రపటాన్ని, పుష్పగుఛ్చాన్ని అందచేసి ఘనంగా సన్మానించారు.
ఎన్టీఆర్ వైద్యసేవల విషయం లో ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 10 మందికి రూ.9.95లక్షలు సీఎం సహా యనిధి మంజూరైంది. ఆ చెక్కులను ఆయన సోమ వారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో లబ్ధిదా రులకు అందజేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలన్నది మాజీ సీఎం జగన్ రెడ్డి కోరిక అని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆ కోరికకు అనుగుణంగా విధివిధానాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
2026వ సంవత్సరం జూన్‌లో భోగాపురం ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ రాకపోకల కోసం ఏడు ప్రధాన రహదారులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో కళాశాలల నిర్మాణాలు లేకుండా ఆహా అనేలా 17 వైద్య కళాశాలలు కట్టేశామని చెప్పుకోవడం మాజీ సీఎం జగన్‌కే చెల్లిందని హోమ్ మంత్రి అనిత విమర్శించారు. 17 వైద్య కళాశాలలు నిర్మించానని చెప్తున్న జగన్ వాటి క్షేత్రస్థాయి పర్యటనకు రాగలరా..? అని ప్రశ్నించారు.
తన బిడ్ట ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని షర్మిల స్పష్టం చేశారు. తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా, బెదురా? అని ఎద్దేవా చేశారు.
వైసీపీ అధినేత జగన్‌పై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అంటే అబద్ధాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జన సైనికుల జోరు.. కమలదళ ఉత్సాహం కలగలసి రాష్ట్రం అన్ని కోణాల్లో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.