Home » Suryapet
సంక్రాంతి పండుగ వేళ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అటు పోలీస్ శాఖ.. ఇటు ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
Telangana:ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. బస్సు టైరు పేలడంతోనే ఈఘటన జరిగినట్లు తెలుస్తోంది.యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంది.
తెలంగాణ: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ జాటోత్ రవి, హోమ్ గార్డ్ గంజి శ్రీను బాహాబాహీకి దిగారు. పోలీసులమనే విషయం మరిచి వీధి రౌడీల్లా చొక్కాలు పట్టుకుని దాడి చేసుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి, ట్రాక్టర్ నాగలి కర్రు గొంతులో దిగబడటంతో మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలంలో ఈ హృదయవిదారకమైన ఘటన జరిగింది.
తన సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నట్లు, ఓ ఎన్నారై వద్ద కారు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
తనకు ఈత రాదని విద్యార్థి చెప్పినా వినని ఓ ట్యూటర్ ‘నేనున్నాను నీకేమీ కాదు దూకు’ అంటూ అతడిని రెచ్చగొట్టి బావిలోకి దింపి విద్యార్థి మృతికి కారణమయ్యాడు. ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది.
వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారంటూ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని ఇన్చార్జి ప్రిన్సిపాల్ కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల జరిగింది.
పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.