Share News

Uttam: మంత్రి ఉత్తమ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:40 AM

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సులో పాల్గొనేందుకు శుక్రవారం హుజూర్‌నగర్‌ నుంచి వెళుతుండగా గరిడేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

Uttam: మంత్రి ఉత్తమ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

  • ఒకదానికొకటి ఢీ.. 8 కార్లు ధ్వంసం.. మంత్రి క్షేమం

గరిడేపల్లి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహన శ్రేణి వెనుక ఉన్న కార్లు ఒకదానికొకటి ఢీకొని స్వల్పంగా దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సులో పాల్గొనేందుకు శుక్రవారం హుజూర్‌నగర్‌ నుంచి వెళుతుండగా గరిడేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం వెనుక పో లీస్‌, ఎస్కార్ట్‌, ఇతర నాయకుల వాహనాలు మొత్తం 11 వస్తున్నాయి.


ఈ క్రమంలో గరిడేపల్లి పోలీసుస్టేషన్‌ వద్దకు రాగానే స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కాన్వాయ్‌లో మంత్రి ప్రయాణిస్తున్న కారును నిలపాలని కోరగా ఒక్కసారిగా ఆపారు. మంత్రి కారు అకస్మాత్తుగా నిలప డంతో వెనుక వస్తున్న వాహనాలను కూడా డ్రైవర్లు నిలిపారు. ఈ క్ర మంలో ఎస్కార్ట్‌ కారుకు వెనుకనున్న కార్లు ఒకదానికొకటి ఢీకొని మొత్తం 8 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే మంత్రి ఉత్తమ్‌ ప్రయాణిస్తున్న కారు ముందు ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Updated Date - Jan 25 , 2025 | 04:40 AM