Home » Srikakulam
ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా రెండు సార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులో కల్తీ ఉందన్నారు.
అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, పోలవరం మెుదటి దశ పనుల కోసం రూ.12,567కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.
Andhrapradesh: విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న వివాదాస్పద ఇంటి వద్దకు ప్రియురాలు దివ్వెల మాధురి వచ్చింది. దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు గత నెలరోజుల నుంచి దువ్వాడ వాణి ఇంటి బయట ఆందోళన చేస్తోంది. ఇంతలో మాధురి వచ్చి, లోపలికి వెళ్లడంతో వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది.
: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కంటిన్యూ అవుతోంది. పూటకో అప్ డేట్, రోజుకో న్యూస్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న ఇంటిపై వివాదం నెలకొంది. ఆ ఇంటిని కూతుళ్ల పేరుతో రాయాలని దువ్వాడ వాణి భీష్మించుకొని కూర్చొంది. ప్రియురాలు దివ్వెల మాధురి పేరుతో ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ రిజిష్ట్రేషన్ చేయించేశారు.
ఇచ్ఛాపురం(Ichchapuram) పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉదయం 3:45గంటలకు భూకంపం వచ్చింది.
టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ్ తిలక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.