Share News

Kuna Ravikumar: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టం

ABN , Publish Date - Mar 10 , 2024 | 12:46 PM

శ్రీకాకుళం జిల్లా: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టమని, ఈ కలయిక పార్టీల కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్ కోసమని, తమ నాయకుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నేత కూనరవికుమార్ అన్నారు.

Kuna Ravikumar: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టం

శ్రీకాకుళం జిల్లా: టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టమని, ఈ కలయిక పార్టీల కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్ కోసమని, తమ నాయకుడు చంద్రబాబు (Chandrababu) తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నేత కూనరవికుమార్ (Kuna Ravikumar) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన శ్రీకాకుళం (Srikakulam)లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయనటానికి ఈ పొత్తు ఓ నిదర్శనమన్నారు. వైసీపీ (YCP) నిరంకుశ పాలన అంతమొందించటానికి చంద్రబాబు, మోదీ (Modi), పవన్ (Pawan) ఒక్కటయ్యారని రాష్ట్ర విభజన నష్టం కన్నా.. జగన్ (Jagan) ఐదేళ్ల పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టి దుర్మార్గమైన పాలన చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

వైసీపీ అన్ని కులాలు, మతాలను వేధింపులకు గురిచేసిందని, జగన్ పాలనలో రెడ్లకే పదవులు ఇచ్చారని, దళితులు తీవ్ర అవమానాలకు గురయ్యారని కూనరవికుమార్ అన్నారు. టీడీపీ బీసీలకు పుట్టినిల్లు అని, టీడీపీ జయహో బీసీ సభకు లక్షలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. తెలుగుదేశంపై బీజేపీ పెద్దలకు ఓ నమ్మకం కలిగిందని, అందుకే కలిసి పనిచేద్దామని బీజేపీ పెద్దలు ఢిల్లీకి ఆహ్వానించారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, కలయిక రాష్ట్ర ప్రజలకు శుభ పరిణామమని, ఈ మూడు పార్టీల పొత్తును ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని కూనరవికుమార్ అన్నారు.

Updated Date - Mar 10 , 2024 | 12:48 PM