Home » Sankranthi festival
సంక్రాంతి సంబరాల్లో పాల్లొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అమరావతి నుంచి హెలికాప్టర్ లో
దేశానికి ఈ సంవత్సరం ప్రత్యేకమైనదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి అంటే సనాతన క్రాంతి అని, ఈ సనాతన క్రాంతిలోనే శ్రీ రాముడి ప్రతిష్ట జరగబోతుందని చెప్పారు. ఈ నెల 22 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని, అనేక ఏళ్ల పోరాటానికి ప్రతిఫలమే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అని ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ(PM Modi) దేశ రాజధాని ఢిల్లీలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.
విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా యూనివర్సిటీలో మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సాయికుమార్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పై కైట్ ఫెస్టివల్‌నీ శనివారం నాడు ప్రారంభించారు.
సంక్రాంతి.. ఈ పేరు చెబితే చాలు.. పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు సొంత ఊళ్లకు వెళ్తామా అని ఆసక్తి చూపిస్తుంటారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు గ్రామాలకు తరలివెళ్తున్నారు. అయితే ప్రధానంగా కొన్ని జిల్లాల్లోనే పలు రకాల పోటీలు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పండగ అంటేనే సంబురం. అలాంటిది సంక్రాంతి అంటే.. ఆ సందడి మామూలుగా ఉండదు. విద్య, ఉద్యోగ ఉపాధి కోసం ఎక్కడెక్కడో
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
సంక్రాంతి పండుగ వస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఉపాది కోసం పల్లె సీమల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలు సంక్రాంతి కోసం తమ తమ గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్తున్నారు.