Share News

Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు..

ABN , Publish Date - Jan 10 , 2024 | 08:41 AM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. దీంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేస్తోంది. అయితే.. దొంగతనాలు జరిగేందుకు ఇదే మంచి తరుణం. కాబట్టి ఇంటికి తాళం వేసుకుని వెళ్లేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఇళ్లల్లో చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గస్తీని పెంచడంతో పాటు దొంగతనాలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇళ్లల్లో బంగారం, వెండి ఆభరణాలు ఉండటం కామన్. విలువైన నగలు, డబ్బులను ఇంట్లో ఉంచకుండా లాకర్లలో భద్రపరుచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో లావాదేవీలన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి కాబట్టి అవసరమైనంత డబ్బును మాత్రమే వెంట ఉంచుకోవడం మేలు. ఊరికి వెళ్లే సమయంలో దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే ఇళ్లకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. వెహికిల్స్ ను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలి.


మెయిన్ డోర్ కు వేసిన తాళం కనిపించకుండా ఉండేలా కర్టెన్లు అడ్డుగా ఉంచాలి. ఇంటి ముందు చెప్పులు, ఇంట్లో లైట్లు వేసి ఉంచాలి. తమ ఇంటిని కనిపెడుతూ ఉండాలని ఇరుగుపొరుగున ఉన్న వారికి చెప్పాలి. నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. సంక్రాంతి.. కాంతి నింపుతుందనడంలో సందేహం లేదు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 08:47 AM