Share News

Kishan Reddy: సంక్రాంతి అంటే సనాతన క్రాంతి, ఈ నెల 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది..

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:47 PM

దేశానికి ఈ సంవత్సరం ప్రత్యేకమైనదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి అంటే సనాతన క్రాంతి అని, ఈ సనాతన క్రాంతిలోనే శ్రీ రాముడి ప్రతిష్ట జరగబోతుందని చెప్పారు. ఈ నెల 22 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని, అనేక ఏళ్ల పోరాటానికి ప్రతిఫలమే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అని ఆయన తెలిపారు.

Kishan Reddy: సంక్రాంతి అంటే సనాతన క్రాంతి, ఈ నెల 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది..

హైదరాబాద్: దేశానికి ఈ సంవత్సరం ప్రత్యేకమైనదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి అంటే సనాతన క్రాంతి అని, ఈ సనాతన క్రాంతిలోనే శ్రీ రాముడి ప్రతిష్ట జరగబోతుందని చెప్పారు. ఈ నెల 22 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని, అనేక ఏళ్ల పోరాటానికి ప్రతిఫలమే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అని ఆయన తెలిపారు. సంక్రాంతి సందర్భంగా హైదరబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా మైదానంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, చింతల రామ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. మోదీ బొమ్మతో కూడిన గాలిపటాన్ని కిషన్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి కిషన్ రెడ్డి సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ వ్యాప్తంగా రకరకాల వారు, వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా అత్యంత వైభవంగా సంక్రాంతి పండగ జరుపుకుంటారు. సంక్రాంతి కుటుంబ సమేతంగా జరుపుకునే పండగ. దేశానికి ఈ సంవత్సరం ప్రత్యేకం.


సంక్రాంతి అంటే సనాతన క్రాంతి. ఈ సనాతన క్రాంతిలోనే శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ నెల 22 కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. అనేక ఏళ్ల పోరాటానికి ప్రతిఫలం శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట. పదేళ్లలో ఎలాంటి మత ఘర్షణలు లేవు. ఆర్‌డీఎక్స్ పేలుళ్లు లేవు. దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట దేశానికి, దేశ ప్రజలకు ఎంతో గర్వకారణం. హిందువులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.’’ అని చెప్పారు. కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ప్రకృతితో ముడిపడిన పండగ. రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని మోదీ 11 రోజులు నిష్టతో కూడిన దీక్ష చేపట్టారు. మోదీ పిలుపును అందుకుని దేవాలయాలను శుభ్రపరిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. 500 ఏళ్ల పోరాట స్ఫూర్తికి నిదర్శనమే శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట’’ అని అన్నారు.

ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 01:47 PM