Home » Raptadu
సరిగ్గా రెండేళ్ల క్రితం నారా లో కేశ చేపట్టిన యువగళం పాదయాత్ర వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని ఎమ్మెల్యే పరిటా ల సునీత పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నారాలోకేశ యువగళం పాదయాత్ర ఆరంభించి న రోజే వైసీపీ పతనం మొదలైందన్నారు.
విద్యార్థులను పస్తులుంచి.. సస్పెండైన చెన్నేకొత్తపల్లి బీసీ బాలుర వసతిగృహం వార్డెన నారాయణస్వామి.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలలో ‘ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్’గా పురస్కారం అందుకున్నారు.
ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశర్‌రెడ్డి మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపై సమగ్ర ద ర్యా ప్తు జరపాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. సో ములదొడ్డి సమీపంలో రైలు పట్టాల వద్ద పడిఉన్న ఉమా మహే శ్వర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతిని నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌లు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. నూతనం గా ఎంపికైన మండలంలోని ప్యాదిండి గ్రామానికి చెందిన గొర్రెల పెంపకం దారుల సంఘం సభ్యులు సోమవారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని మ ర్యాదపూర్వకంగా కలిశారు.
లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన గృహం సందర్శనకు సంబంధించి విజ్ఞాన విహార యాత్ర పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. నగరంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విడు దల చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా స్వచ్చాంధ్రప్రదేశను చూడాలం టే మన ఇళ్లు, మన వీధుల నుంచే పరిశుభ్రత ప్రారంభం కావా లని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం రామగిరిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో అఽమె అధికారు ల తో కలిసి పాల్గొన్నారు.
మండలంలోని పుట్ట కనుమ ఘాట్‌రోడ్ ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. భానుకోట గ్రామ సమీపంలో పుట్టకనుమ ఘాట్‌రోడ్ ఉంది. ఈ రహ దారి గుండా ప్రతిరోజు వందలు వాహనాలు ధర్మవరం, తరగరకుంట, కళ్యాణదుర్గం మీదుగా వెళుతుంటాయి. ఘాట్‌రోడ్డు వద్దకు రాగానే వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నా రు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో గ్రామాల రోడ్లు రూపురేఖలు మా రుతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, గుంతల రోడ్ల స్థానం లో తారురోడ్లు నిర్మిస్తుండడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. మండలంలోని మరూరు నుంచి చాపట్లకు, మరూరు నుంచి ఎం. చెర్లోపల్లి మీదుగా పాలబావికి తారురోడ్ల నిర్మాణానికి గత టీడీపీ ప్రభు త్వంలో 2018లో అప్పటి మంత్రి పరిటాల సునీత నిధులు మంజూరు చేయించారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించా రు.
మండలంలోని మా మిళ్ళపల్లిలో భరతరెడ్డి అనే రైతుకు చెందిన శ్రీగంధం చెట్లు సో మవారం అగ్నికి ఽఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన భరతరెడ్డి ఐదెకరాల్లో శ్రీగంధం చెట్లు సాగుచేస్తున్నాడు. ఆ తోటలో మంట లు వ్యాపిస్తున్నాయని స్థానిక రైతులు అతడికి సమాచారం అందించారు.