MLA SUNITHA: సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Feb 06 , 2025 | 11:40 PM
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం అని ఎ మ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గురువారం మండలం నాయకులతో నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె సమావేశం అయ్యారు.
అనంతపురంరూరల్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం అని ఎ మ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గురువారం మండలం నాయకులతో నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె సమావేశం అయ్యారు. గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది ఆరా తీశారు. ప్రధానంగా ఇంటి పట్టాల విషయంపై చర్చించారు. గతంలో మండలం పరిధిలో కొన్ని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. వాటిలో ఒక్కటి కూడా పూర్తి కాలేదన్నారు. ఈ విషయంపై హౌసింగ్, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఇప్పటికే అలాంటి వాటి జాబితా సిద్ధం చేశామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. గ్రామాల్లో ఇళ్లు లేని వారి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు.