PROGRESS : పల్లెల్లో అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:30 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, తారురోడ్లు, తాగునీటి సౌకర్య తదితర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుటుంటపడింది. డ్రైనేజీ లేకపోవడంతో వీధుల్లో మురుగునీ రు ప్రవహించేదని, రోడ్లు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని ప లు గ్రామాల ప్రజలు అంటున్నారు.
ఆత్మకూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, తారురోడ్లు, తాగునీటి సౌకర్య తదితర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుటుంటపడింది. డ్రైనేజీ లేకపోవడంతో వీధుల్లో మురుగునీ రు ప్రవహించేదని, రోడ్లు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని ప లు గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇప్పుడు రోడ్ల నిర్మాణంతో ప్రశాంతంగా ఉందని హర్షం వ ్యక్తం చేస్తున్నారు. మండలపరిధిలోని పలు గ్రామాల్లో రూ. 3కోట్లతో సిమెంటు రోడ్లు వేశారు. దీంతో పాటు తలుపూరు గ్రామానికి రూ. కోటితో తారురోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే గొరిదిండ్ల, తోపుదుర్తి గ్రామాల్లో రెండు విద్యుత సబ్‌స్టేషన్ల పనులు జరుగుతున్నాయి. ఆత్మకూరు మేజర్ పంచాయతీలో ముందస్తుగా తాగునీటి సమస్య తలేత్తకుండా రూ. 30లక్షలతో రెండు బోర్లు వేసి, ఇంటింటా నీటి సరఫరాకు పైప్‌లైన చేశారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ది పనులకు ప్రతిపాదనలు పంపారు. గత ఐదేళ్లలో వైసీసీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కూట మి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ఆర్నెల్లలోనే జరుగుతున్నాయిని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్లే సొంత ఊరిలోనూ...
మండల పరిధిలోని తన స్వగ్రామమైన తోపుదుర్తిలో గత ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేయలేని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆర్నెల్లలోనే చేయించారు. రూ. కోటితో విద్యుత సబ్‌స్టేషన, రూ. 40లక్షలతో సీసీరోడ్లు, రూ. 20లక్షలతో గోకులం షెడ్లు, రూ. 15లక్షలతో తాగునీటి పైపులైను పనులు చేయించారు. వీటితో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....