GOD : సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:06 AM
మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, బంగారు కవచసేవ, పల్లకిసేవ ఆకుపూజ, అర్చనలు చేశారు.

ఆత్మకూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, బంగారు కవచసేవ, పల్లకిసేవ ఆకుపూజ, అర్చనలు చేశారు. కుజదోష కాలసర్పదోష నివారణ కోసం హోమం నిర్వహించారు. లోకకల్యాణార్థం సూర్యనమస్కారాలు, అరుణహోమం నిర్వహించారు. మాఘమాసం మూడో ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్న దానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాబు, ప్రధాన అర్చకులు రాముస్వామి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....