MLA : ప్రతిపంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:12 AM
రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. మండల కేంద్రమైన రామగిరిలో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, టీడీపీ స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు విషయాలపై రైతులతో చర్చించారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. మండల కేంద్రమైన రామగిరిలో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, టీడీపీ స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు విషయాలపై రైతులతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... కందుల కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి పంట కొన్న తరువాత నిర్ణీత గడువు కంటే మందుగానే వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందన్నారు. అఽధికారులు రైతులకు పూర్తిగా సహకరించాలన్నారు. రైతులు దళారీల చేతిలో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామ్మూర్తినాయుడు, బీసీసెల్ జిల్లా అద్యక్షుడు రంగయ్య, పరంధామయాదవ్, మండల కన్వీనర్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి మారుతీప్రసాద్, పేరూరు డ్యాం సాగునీటి సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీధర్‌నాయుడు, సుబ్బరాయుడు, పేపర్‌శీన, మాజీ సర్పంచ శ్రీనివాసులు, అక్కులప్ప, ఎంపీటీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....