MLA SUNITHA: రైతులు నష్టపోకుండా చూస్తాం
ABN , Publish Date - Feb 02 , 2025 | 12:00 AM
రువు జిల్లాలోని రైతులు నష్టపోకుండా చూస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం మండలంలోని రాచానపల్లి గ్రామం వద్దనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కార్యక్రమం చేపట్టారు.
అనంతపురంరూరల్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కరువు జిల్లాలోని రైతులు నష్టపోకుండా చూస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం మండలంలోని రాచానపల్లి గ్రామం వద్దనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. పలువురు రైతులు తమ సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం ఎకరాకు 2.5 క్వింటాళ్ల కందులు మాత్రమే కొనుగోలు చేస్తోందని, దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఎకరాకు ఐదు క్వింటాళ్ల వరకు కందులు కొనుగోలు చేయాలని, ఆమేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి ఫోన ద్వారా రైతులు విజ్ఞప్తులను తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. మండల కన్వీనర్ జింకాసూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, రఘు, పామురాయి వెంకటేష్, లక్ష్మీనారాయణ, నారాయణస్వామి, క్రిష్ణారెడ్డి, నారాయణరెడ్డి, కొండయ్య, సర్ధానప్ప, అల్లీపీర, నాగరాజు. ఎర్రిస్వామి, బుల్లెట్ రఫీ, బొజ్జయ్య, గోపాల్, రవి పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష విభాగాన్ని అవినీతి మయం చేశారు
గత ప్రభుత్వంలో సమగ్ర శిక్ష విభాగాన్ని అవినీతి మయం చేశారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా సమగ్ర శిక్ష విభాగం అధికారులతో ఆమె సమావేశమయ్యారు. నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో సమగ్ర శిక్ష పాఠశాలల్లో జరుగుతున్న పనులు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత తదితర అంశాలపై సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల యాక్షన ప్లానలో భాగంగా పేరూరు ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల మరమ్మతులకు రూ.44 లక్షలు, నసనకోటలో రూ.25 లక్షలతో పనులు చేపట్టాలన్నారు.
అర్హులైన వారందరికీ పింఛన్లు
రామగిరి అర్హులైన వారందరికీ పింఛన్లు అందుతాయని ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. మండలంలోని నసనకోట పంచాయతీ ముత్యాలంపల్లి గ్రామంలో శనివారం పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఉదయాన్నే ఆమె గ్రామానికి వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు రామ్మూర్తినాయుడు, మండల కన్వీనర్ సుధాకర్, ఎంఈఓ శ్రీనివాసులు, ఎంసీ పల్లి మాజీ సర్పంచ ముత్యాలప్ప, నాయకులు మారెన్న, సత్యనారాయణ, వడ్డివెంకటేశ పాల్గొన్నారు.