Home » Rains
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. ఈ రుతుపవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
ఎగువ ప్రాంతాలతో పాటు చిత్తూరు సమీప మండలాల్లో భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నగరంలోని నీవా పరివాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.
జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసాయి.
ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం నాడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిన ఘటనలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు భారీ వర్షం కురుస్తుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విషయంపై గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో బాహ్య ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
ఒకవైపు వర్షాలు.. మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్లు.. నగరంలో అడుగు ముందుకు వేయాలంటే అడుగడుగునా అడ్డంకులు. ఐటీ కారిడార్లోనే కాకుండా కోర్ సిటీలోనూ ట్రాఫిక్ జామ్లు, ధ్వంసమైన రోడ్లపై ప్రయాణం నరకరంగా మారింది.
హైదరాబాద్ నగరంలో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుంది, ఆ తర్వాత ఆకాశం మేఘావృతమై.. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబర్ 10 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని పేర్కొంది. దీంతో పాటూ..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రాష్ట్రంలో విస్తరించిన కారణంగా ఈ నెల 9వ తేదీ గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.