Home » Rains
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
జ్వరంతో బాధపడుతున్న బాలుడిని మేనమామ భుజంపై కూర్చోబెట్టుకొని ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటించారు.
ఎల్‌నినో ప్రభావంతో 100 రోజులుగా వర్షాభావంతో ఎండుముఖం పడుతున్న ఖరీఫ్ పంటలకు తీవ్ర వాయుగుండం ఊపిరి పోసింది.
తీవ్ర వాయుగుండం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆకస్మిక వరదల వల్ల ముంపు బారిన పడే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
సీమలో చినుకుల సవ్వడినుంచి కోస్తాలో జడివాన మొదలుకుని.. ఉత్తరాంధ్రలో అతిభారీ వానలతో పుడమి పులకరించింది! ఇన్నాళ్లకు కురిసిన వాన.. పంటకు ప్రాణం పోసింది. వాగులూ వంకలకు జల కళ తెచ్చింది.
విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులతోపాటు జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులను ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అప్రమత్తం చేశారు.
తుపాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు రోడ్లు, జంక్షన్లలో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.