Rains In AP: బిగ్ అలర్ట్.. ఏపీలో రానున్న మూడు గంటల్లో వర్షాలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:34 PM
భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మొంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుపాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అయితే, గత రెండు రోజుల నుంచి వర్షాలు ఆగిపోయాయి. జనం ఇప్పుడిప్పుడే తుపాన్ ప్రభావం నుంచి కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం..
గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో వర్షాలు లేవు. ఉన్నట్టుండి ఆదివారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భాగ్యనగరంలోని పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, బోరబండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, ముషిరాబాద్, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
కేటీఆర్ రోడ్ షో అర్థాంతరంగా వాయిదా..