Share News

Jubilee Hills By Election: కేటీఆర్ రోడ్ షో అర్థాంతరంగా వాయిదా..

ABN , Publish Date - Nov 02 , 2025 | 08:22 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేటీఆర్ నిర్వహించాల్సిన రోడ్ షో చివరి నిమిషంలో వాయిదా పడింది.

Jubilee Hills By Election: కేటీఆర్ రోడ్ షో అర్థాంతరంగా వాయిదా..

హైదరాబాద్, నవంబర్ 2: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ రోడ్డు షో అర్థాంతరంగా వాయిదా పడింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి యూసఫ్‌గూడ డివిజన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వాహించాల్సి ఉంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి వెంకటగిరి చౌరస్తా వరకు ఈ రోడ్ షో నిర్వహించి.. అనంతరం స్థానిక యూసఫ్ గూడ డివిజన్ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆదివారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో కేటీఆర్ రోడ్డు షో అర్థాంతరంగా వాయిదా పడింది. మళ్లీ ఈ రోడ్డు షో ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.


మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో గెలుపు.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మధ్య ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి తమ ప్రభుత్వానికి ప్రజలలో మంచి ఆదరణ ఉందని నిరూపించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో తన కేబినెట్‌లోని మొత్తం మంత్రులను సీఎం రంగంలోకి దింపారు.


అలాగే ఈ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది. దాంతో ఈ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ పక్కా ప్రణాళిక బద్దంగా పని చేసుకొంటూ ముందుకు వెళ్తుంది.


మరోవైపు బీజేపీ సైతం.. గత బీఆర్ఎస్ పాలన.. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తమ పార్టీ గెలుపు ద్వారా స్పష్టం చేయాలని భావిస్తుంది. దీంతో ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఈ మూడు రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నిక లక్ష్యంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రజల మధ్యకు వెళ్తున్నాయి.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి ఓటరు పట్టం కట్టాడనేది తెలియాలంటే నవంబర్ 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక పౌర్ణమి.. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..

నవంబర్ మూడో వారం చివరి నుంచి ఈ రాశులకు అదృష్ట యోగం

For More TG News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 08:27 PM