Home » Rahul Gandhi
దేశంలో ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్, కొత్తగా పుట్టుకొచ్చిన మరికొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ నాయకుడిగా చూపించుకోవడంలో ప్రజల ముందు విఫలమయ్యారని, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను ఢిల్లీ మంత్రి పర్వేశ్ శర్మ చెంపదెబ్బ కొట్టడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల మధ్య ప్రశ్నిస్తే, చెంపదెబ్బ కొడుతున్నారని, పేపర్ లీకుల గురించి మాట్లాడితే లాఠీచార్జి చేయిస్తున్నారని బీజేపీ ప్రభుత్వాలపై ఎక్స్‌లో ఆయన మండిపడ్డారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను రాజీనామా చేయమనడం, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వరుసగా ఓడిపోతుండడంతో రాహూల్‌కు మతిస్థిమితం తప్పినట్లుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్‌కు రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది అన్నారు. కాంగ్రెస్ పతనానికి సోనియా, రాహుల్ గాంధీనే కారణమని ఆయన ఆరోపించారు.
ఎంతటి నేతలపైనైనా కొన్నేళ్ల పాలన తర్వాత ప్రజా వ్యతిరేకత రావడం సహజమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
ఐఐటీ విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. న్యాయం కోసం వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య కూటమి రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఇండోర్‌లో జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. రాహుల్ స్టాండ్-అప్ కమెడియన్‌గా మారితే మంచి ఉపాధి లభిస్తుందన్నారు.
‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో వివాదాస్పదంగా మారింది. దానిపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.