Home » Rahul Gandhi
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసింది. ఈ బృందంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా ఉన్నారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ED దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మే 25వ తేదీకి వాయిదా వేసింది.
మణిపుర్‌లో తలెత్తిన తాజా ఉద్రిక్తతలపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. మణిపుర్‌ను బీజేపీ మంటల్లోకి నెట్టిందని, అక్కడి మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలకు అధికార పార్టీనే కారణమని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్‌లో మోదీ ఉన్నారని ఆరోపించారు.
ద్వంద్వ పౌరసత్వం వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై FIR నమోదు చేయాలని లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని అన్నారు.
లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగం వినడం తలనొప్పిగా మారిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ ప్రసంగం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అసలు విషయాలను రాహుల్ పక్కనపెట్టి తన వ్యక్తిగత విషయాలు, బాల్యం ముచ్చట్లు చెప్పడం తనకు తలనొప్పి కలిగించిందని అన్నారు.
మహిళా కోటా చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి అని.. దాన్ని ప్రతిపక్షం ఓడించిందని లోక్‌సభలో విపక్ష నేత...
భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు ఈరోజు అవమాన దినమని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరో మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ ముగిసింది. ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిపక్ష 'ఇండి' (INDIA) కూటమి లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు.