Home » Prabhas
తమ అభిమాన హీరో పాత సినిమా రీరిలీజ్ అవుతుండడంతో అభిమానులు థియేటర్లకు వెళ్లి నానా హంగామా చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ అభిమానులు ఏపీలోని రెండు చోట్ల బీభత్సం సృష్టించారు. నంద్యాలలోని రాజ్ థియేటర్‌తో పాటు కాకినాడలోని శ్రీప్రియ థియేటర్‌లో అభిమానులు స్క్రీన్‌లను చించివేశారు. సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో అభిమానులు స్క్రీన్ మీద పడటంతో రెండు చోట్ల భారీగా డ్యామేజ్ జరిగింది.
గురువారం రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా నచ్చని ఇద్దరు అభిమానులు మీడియాకు నెగెటివ్ రివ్యూ ఇవ్వడాన్ని తలైవా అభిమానులు జీర్ణించులేకపోయారు. వారిద్దరిపై భౌతిక దాడికి దిగారు.
సినిమా విడుదలైనప్పటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న 'ఆది పురుష్' టీమ్ ఎట్టకేలకు 'గుడ్ న్యూస్' న్యూస్ చెప్పింది. ఎడిటింగ్, మార్చిన సంభాషణలతో కూడిన 3డీ వెర్షన్‌కు సకుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తూ, ఇందుకోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అయితే.. ఈ విషయంలో కూడా వివాదం తొంగిచూసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ‘‘ఆదిపురుష్’’ సినిమాలో రావణాసురుడి చెల్లి శూర్పణక పాత్రలో నటించిన తేజస్విని పండిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నెటిజన్లు ఈ భామ గురించి తెగ ఆరా తీస్తున్నారు.
ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ ఎంపికే తప్పనట్టుగా కొందరు నెటిజన్లు దర్శకుడు ఓం రౌత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభాస్ కంటే రాముడిగా పలానా హీరో బాగుంటాడని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.
‘ఆదిపురుష్’ సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్ ఎఫెక్ట్స్‌పై పెదవి విరుస్తున్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయని అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్‌పై (Tollywood) బీజేపీ (BJP) స్పెషల్ ఫోకస్ పెట్టిందా..? తెలంగాణలో బీజేపీ (TS BJP) బలోపేతానికి సెలబ్రెటీలను వాడుకోవాలని అగ్రనేతలు భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను చూస్తే ఇదే అక్షరాలా నిజమయ్యేలా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah).. తెలంగాణలో పర్యటించిన ప్రతీసారి సినీ సెలబ్రిటీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు..
అభిమాన నటుల వీడియో స్టేటస్ (Video Status) విషయంలో జరిగిన వివాదం హత్యకు దారితీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) అత్తిలిలో జరిగింది..
అమితాబ్ బచ్చన్ కి 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్ లో గాయాలు తగిలాయి అన్న వార్తలో నిజం లేదు అని ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ చెప్పారు.
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) లో నటించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 10నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.