Adipurush: ప్రభాస్ ఎంపికే తప్పట.. ఏ హీరో అయితే రాముడిగా బాగుంటుందని ఓం రౌత్‌కు సలహా ఇస్తున్నారంటే..

ABN , First Publish Date - 2023-06-16T18:43:02+05:30 IST

ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ ఎంపికే తప్పనట్టుగా కొందరు నెటిజన్లు దర్శకుడు ఓం రౌత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభాస్ కంటే రాముడిగా పలానా హీరో బాగుంటాడని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.

Adipurush: ప్రభాస్ ఎంపికే తప్పట.. ఏ హీరో అయితే రాముడిగా బాగుంటుందని ఓం రౌత్‌కు సలహా ఇస్తున్నారంటే..

ఒక సినిమా హిట్ అయితే ప్రశంసలు ఎంత సహజమో.. ఫ్లాప్ అయితే విమర్శలు కూడా అంతే సహజం. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ చేతికొచ్చి, ఇంటర్నెట్ ఇంటికొచ్చి.. సోషల్ మీడియా వినియోగం పెరిగింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలే సినిమాలను ముంచేదయినా, లేపేదయినా. ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే ‘కాంతారా’ (Kantara), ‘బలగం’ (Balagam) లాంటి సినిమాలను ఎంతగా ఆకాశానికెత్తేస్తారో.. ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ లాంటి సినిమాలను కూడా అంతగా ఏకిపడేస్తారు. ఇప్పుడు ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ సినిమాల మాదిరిగానే మరో పెద్ద సినిమాపై, ఆ సినిమా దర్శకుడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ తాజా సినిమా ‘ఆదిపురుష్’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

adipurushwar.jpg

కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టుగా ‘ఆది పురుష్’ సినిమాపై విమర్శలకు కూడా కారణాలు చాలానే ఉన్నాయి. ఆ కారణాల్లో తాజాగా రాముడి పాత్ర వేషధారణ, రాముడి పాత్రను చిత్రీకరించిన విధానం కూడా ఒక కారణంగా నెట్టింట కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుండటం కొసమెరుపు. శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ ఎంపికే తప్పనట్టుగా కొందరు నెటిజన్లు దర్శకుడు ఓం రౌత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభాస్ కంటే రాముడిగా పలానా హీరో బాగుంటాడని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.

Adipurush-1.jpg

వాస్తవానికి ప్రభాస్ రాముడి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ మూలాన ప్రభాస్‌ను కొన్ని సన్నివేశాల్లో రాముడిగా చూడటానికి ఇబ్బందిగా అనిపించిందే తప్ప ఓం రౌత్ ఎంపిక తప్పు కాదనే వాదనా వినిపిస్తోంది.

Ram.jpg

ప్రభాస్ కాకపోతే శ్రీరాముడి పాత్రకు ఇంకెవరంటారా.. కొందరు నెటిజన్లు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించిన సన్నివేశాన్ని పోస్ట్ చేస్తూ.. రాఘవుడి పాత్రకు రాంచరణ్ అయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

adipurush-prerelease.jpg

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా క్లైమాక్స్‌లో రాంచరణ్ అల్లూరిగా చేసే వీరోచిత పోరాట సన్నివేశం ట్విట్టర్‌‌లో (Twitter) ట్రెండ్ అవుతోంది. నిజానికి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలయినప్పుడు అల్లూరి వేషధారణలో రామ్ చరణ్‌ను చూసి ఉత్తరాది ప్రేక్షకులు అచ్చం శ్రీరాముడిలా ఉన్నాడని అభిప్రాయపడ్డారు. పలు థియేటర్లలో అల్లూరి పాత్రలో రామ్ చరణ్ కనిపించినప్పుడు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసిన వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.

Updated Date - 2023-06-16T18:43:26+05:30 IST