Shah Meeting With Celebrities : టాలీవుడ్‌పై బీజేపీకి ఎందుకింత స్పెషల్ ఫోకస్.. రాజమౌళి, ప్రభాస్‌తో అమిత్ షా భేటీపై సర్వత్రా ఉత్కంఠ..!

ABN , First Publish Date - 2023-06-13T19:00:26+05:30 IST

టాలీవుడ్‌పై (Tollywood) బీజేపీ (BJP) స్పెషల్ ఫోకస్ పెట్టిందా..? తెలంగాణలో బీజేపీ (TS BJP) బలోపేతానికి సెలబ్రెటీలను వాడుకోవాలని అగ్రనేతలు భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను చూస్తే ఇదే అక్షరాలా నిజమయ్యేలా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah).. తెలంగాణలో పర్యటించిన ప్రతీసారి సినీ సెలబ్రిటీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు..

Shah Meeting With Celebrities : టాలీవుడ్‌పై బీజేపీకి ఎందుకింత స్పెషల్ ఫోకస్.. రాజమౌళి, ప్రభాస్‌తో అమిత్ షా భేటీపై సర్వత్రా ఉత్కంఠ..!

టాలీవుడ్‌పై (Tollywood) బీజేపీ (BJP) స్పెషల్ ఫోకస్ పెట్టిందా..? తెలంగాణలో బీజేపీ (TS BJP) బలోపేతానికి సెలబ్రెటీలను వాడుకోవాలని అగ్రనేతలు భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను చూస్తే ఇదే అక్షరాలా నిజమయ్యేలా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah).. తెలంగాణలో పర్యటించిన ప్రతీసారి సినీ సెలబ్రిటీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఆ మధ్య టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , నితిన్ (Nithin), మిథాలీ రాజ్‌తో (Mithali Raj) షా భేటీ కాగా.. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అలియాస్ జక్కన్న, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో (Prabhas) షా భేటీ కాబోతున్నారు. ఇప్పటి వరకూ సెలబ్రిటీలతో జరిగిన భేటీల్లో ఏం చర్చించారు..? ఇప్పుడు ఈ ఇద్దరితో ఏం చర్చించబోతున్నారు..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tollywood.jpg

ప్రతిసారీ ఎందుకో ఇలా..?

అమిత్ షా ఈనెల 15న తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో షా పాల్గొననున్నారు. అదే రోజు టాలీవుడ్‌కు చెందిన రాజమౌళీ, ప్రభాస్‌తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. సినీ, మీడియా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పర్యటనలో మొత్తం నలుగురు ప్రభావవంతమైన వ్యక్తులను షా కలవబోతున్నారు. గురువారం నాడు నోవాటెల్ హోటల్ వేదికగా ఈ సమావేశం జరగనున్నది. అయితే.. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ఎవరో ఒక సెలబ్రిటీని కలవడం షాకు మామూలే.. భేటీ అవుతున్నారు సరేగానీ ఏం చర్చిస్తున్నారు..? అసలు ఈ భేటీ ఎందుకోసం..? అనేది అటు బీజేపీ నుంచి గానీ.. ఇటు సమావేశమైన సెలబ్రిటీల నుంచి గానీ ఎలాంటి సమాచారం ఇంతవరకూ రాలేదు. అయితే ఇప్పుడు రాజమౌళి, ప్రభాస్‌తో భేటీ అవుతుండటంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. సంపర్క్ సే సమర్ధన్ ప్రోగ్రామ్‌లో (Sampark Se Samarthan) భాగంగా ఈ భేటీ జరగబోతోంది. వీరితో పాటు మరో ఇద్దరు సెలబ్రిటీలతోనూ అమిత్ షా భేటీ కాబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరనేది అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

shah-and-Junior.jpg

ఏం నడుస్తోంది..?

అమిత్ షా ఒక్క తెలంగాణలోనే కాదు.. వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడల్లా సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రాజమౌళి, ప్రభాస్‌తో భేటీ అవుతున్నారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అటు ప్రభాస్‌కు ఇటు రాజమౌళికి ఇద్దరికీ బీజేపీ బ్యాగ్రౌండ్ ఉంది. ఎలాగంటే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) బీజేపీకి చెందిన వ్యక్తి.. పలు కీలక శాఖలకు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) బీజేపీ రాజ్యసభ ఎంపీ. ఇలా బీజేపీ బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి ఈ ఇద్దరితో భేటీ అవుతున్నారా..? లేకుంటే వేరే ఏమైనా కారణాలున్నాయా..? అనేదానిపై క్లారిటీ రావట్లేదు. అయితే.. ప్రభాస్‌ను బీజేపీలో చేరాలని అగ్రనేతలు ఆహ్వానించారని చాలా రోజులు వార్తలు సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమావేశంలో భాగంగా ప్రభాస్ చేరిక గురించి చర్చకు వచ్చే అవకాశముంది. ఇక జక్కన్నకు కూడా ఆహ్వానం ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా ‘ఆదిపురుష్’ (Adipurush) రిలీజ్ సందర్భంగా ప్రభాస్‌కు షా ఆల్ ది బెస్ట్ చెబుతారని తెలుస్తోంది.

Shah-and-Prabhas-Rajamouli.jpg

మొత్తానికి చూస్తే.. టాలీవుడ్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని ఈ సెలబ్రిటీలతో భేటీని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ భేటీతో బీజేపీకి ఒరిగేదేముంది..? పోనీ ఈ పెద్ద తలకాయలను స్టార్ క్యాంపెయినర్‌లగా సేవలు వినియోగించుకోవాలని భావిస్తోందా..? అనేది తెలియట్లేదు. ఏదో నడుస్తోంది కానీ.. అంతా లోలోపలే జరుగుతోందే తప్ప బయటికి పొక్కట్లేదు.. అదేంటో తెలియాంటే ఎన్నికల వరకూ వేచి చూడక తప్పదు మరి.

bjp.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Ambati Rayudu In Politics : అంబటి రాయుడు కాదు బాబోయ్.. బూతుల రాయుడు.. ఇంత పచ్చిగానా.. ఓహో వైసీపీకి నచ్చింది ఇందుకేనా..?

******************************

Janasena : జనసేన కండువా కప్పుకున్న ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. చేరిక సరే ఈసారైనా పోటీచేస్తారా..?

******************************

TS Congress : కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్న వేళ సీన్ రివర్స్.. ఎందుకిలా..?

******************************

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

******************************
TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

*****************************

Updated Date - 2023-06-13T19:06:28+05:30 IST