Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

ABN , First Publish Date - 2023-06-12T18:27:38+05:30 IST

ముద్రగడ (Mudragada).. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కాపు నేతగా, ఉద్యమకారుడిగా గోదావరి జిల్లాల్లో (Godavari Districts) మంచి గుర్తింపు ఉంది. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన ఘనత ముద్రగడకే సొంతమని అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు..

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham).. మళ్లీ పొలిటికల్ రీ-ఎంట్రీ (Political Re Entry) ఇస్తున్నారా..? కొన్నేళ్లుగా రాజకీయాల పరంగా ఎక్కడా కనిపించని కాపు నేత ఇప్పుడు యాక్టివ్‌ కావాలని భావిస్తున్నారా..? ఈయన్ను పార్టీలోకి చేర్చుకోవాలని అధికార వైసీపీతో(YSR Congress) పాటు మరోపార్టీ పోటీ పడుతోందా..? అయితే ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఒకట్రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయా..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సీట్లలో ఎక్కడ్నుంచైనా సరే పోటీ చేయొచ్చని వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయా..? అధికారంలోకి వచ్చాక కాపులకు పెద్ద పీట వేస్తాం.. రిజర్వేషన్లు, కార్పొరేషన్ పెట్టి ప్రత్యేకంగా నిధులు అని చెప్పి చివరికి మాట తప్పిన జగన్ పార్టీలోకే చేరడానికి ఉద్యమనేత భావిస్తున్నారా..? అంటే రెండు మూడ్రోజులుగా గోదావరి జిల్లాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కాస్త లోతుగా గమనిస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ ఎవరెవరు ముద్రగడను ఆహ్వానించారు..? ముద్రగడకు వైసీపీ ఇచ్చిన ఆఫర్లు ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

Mudragada-Padmanabham.jpg

ఇదీ అసలు కథ..

ముద్రగడ (Mudragada).. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కాపు నేతగా, ఉద్యమకారుడిగా గోదావరి జిల్లాల్లో (Godavari Districts) మంచి గుర్తింపు ఉంది. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన ఘనత ముద్రగడకే సొంతమని అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. ఒకప్పుడు రాజకీయాల్లో (Mudragada Politics) ఓ వెలుగు వెలిగి.. 2014 ఎన్నికల (2014 Elections) నుంచి పెద్దగా యాక్టివ్‌గా లేరు కానీ.. కాపుల హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. తుని ఘటన (Tuni Incident) తర్వాత మళ్లీ ఈయన అడ్రస్ లేరు. ఈ మధ్యనే తుని ఘటనలో కేసులన్నీ జగన్ సర్కార్ కొట్టివేసింది. అలా శుభవార్త చెప్పిన వైసీపీ.. ఇలా పార్టీలో చేరాలని ఆహ్వానం పంపిందట. ఇటీవలే ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (MP Midhun Reddy) ద్వారా సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) రాయబారం పంపినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. పార్టీలో చేరితే కాకినాడ ఎంపీగా (Kakinada MP) పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోందట. అంతేకాదు.. కాకినాడ ఎంపీ స్థానంతో పాటు ప్రత్తిపాడు (Prathipadu), పెద్దాపురం (Peddapuram) ఎమ్మెల్యేగా పోటీచేయొచ్చని ముద్రగడ ముందు మూడు ఆప్షన్‌లను వైసీపీ ఉంచిందట. జగన్ మాటగా చెబుతున్నానని.. ఒకటికి రెండుసార్లు ముద్రగడతో మిథున్ చెప్పారట. అంతేకాదు.. ఎంపీ లేదా ఎమ్మె్ల్యేగా ముద్రగడ ఇంట్రెస్ట్ చూపించకపోతే.. ఆయన కుమారుడ్ని అయినా సరే వైసీపీలోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందట.

WhatsApp Image 2023-06-12 at 5.01.29 PM.jpeg

ఎవరెవరు ముద్రగడకు టచ్‌లోకి వెళ్లారు..?

వైసీపీతో పాటు జనసేన నేతలు కూడా ముద్రగడకు టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాపుల హక్కుల కోసం పోరాటం చేయడానికి, జనసేన బలోపేతం కోసం పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. అయితే.. అటు వైసీపీకి గానీ.. ఇటు జనసేనకు హైకమాండ్‌కు ముద్రగడ ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదట. మరోవైపు.. ముద్రగడ ఇంటికెళ్లిన కాకినాడ ఎంపీ వంగా గీత, జ్యోతుల చంటిబాబులు కూడా మంతనాలు జరిపారని తెలుస్తోంది. అయితే వైసీపీకి మాత్రం.. త్వరలోనే కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు, క్యాడర్‌తో చర్చించి నిర్ణయం తీసుకునే యోచనలో ముద్రగడ ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి చాలా రోజులుగా ఈయన మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారట. ఇంతలోనే అధికార పార్టీ నుంచి ఆహ్వానం రావడం.. పైగా గత ఎన్నికల్లో వైసీపీకే ఈయన మద్దతిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు వైసీపీ నుంచే ఆహ్వానం రావడంతో ముద్రగడ అభిమానులు, కార్యకర్తల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.

WhatsApp Image 2023-06-12 at 5.02.21 PM.jpeg

వైసీపీకి ఏం లాభం..?

2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేయబోతున్నాయని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ముద్రగడను వైసీపీలో చేర్చుకుంటే ఆ రెండు పార్టీలను దెబ్బ కొట్టొచ్చన్నది జగన్ ప్లానట. అంతేకాదు.. కాపు నేతగా ఉన్న ముద్రగడను వైసీపీ తరఫున బరిలోకి దింపితే.. ఆయన పోటీచేసే స్థానంతో పాటు కాపులు అత్యధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలపై ఆ ప్రభావం ఉంటుందని వైసీపీ ప్లాన్ చేసిందట. మరీ ముఖ్యంగా.. గోదావరి జిల్లాల్లో బలపడుతున్న జనసేనకు చెక్ పెట్టాలంటే కాపు నేతకు పెద్దపీట వేయాలన్నది కూడా జగన్ మనసులోని మాటని తెలుస్తోంది. అంతేకాదు.. పవన్‌తో పోలిస్తే కాపుల కోసం పోరాడే క్రెడిబిలిటీ ముద్రగడకే ఎక్కువగా ఉందని.. దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవాలన్నది వైసీపీ ప్లానట. ముద్రగడ చేరిక జరిగితే కచ్చితంగా కాపులంతా వైసీపీ వైపు తిప్పుకోవడానికి ఇప్పట్నుంచే జగన్ వ్యూహాలు రచిస్తున్నారని తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తోంది. ఒకవేళ ముద్రగడ.. వైసీపీ ఆఫర్‌ను ఒప్పుకొని కాకినాడ ఎంపీగా బరిలోకి దిగితే.. ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థంగా మారింది.

WhatsApp Image 2023-06-12 at 5.02.51 PM.jpeg

ఇవన్నీ మర్చిపోతే ఎలా ముద్రగడా..!?

గత ప్రభుత్వాలు కాపులకు 5 శాతం రిజర్వేషన్ (Kapu Reservation) ఇస్తామని చెప్పడం.. ఇందుకు సంబంధించిన బిల్లులను కేంద్రానికి కూడా పంపడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్‌లోనే ఉంది. దీంతో ముద్రగడ ఉద్యమం మొదలెట్టారు. అదే ఐదు శాతం వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇవ్వాలని జగన్‌ను కాపు ఉద్యమనేతలు కోరారు. ఈ క్రమంలో జగన్ సాధ్యమైనంత వరకూ చేయగలిగింది చేస్తానని మాటిచ్చారు కూడా. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ వకల్తా పుచ్చుకున్న ముద్రగడ.. తన సామాజిక వర్గం ఓట్లన్నీ ఫ్యాన్ గుర్తుకే పడేలా పిలుపునిచ్చారు.. ఇదంతా వైసీపీకి కలిసొచ్చి అధికారంలోకి వచ్చింది కూడా. అయితే ఇంతవరకూ జగన్ మాత్రం రిజర్వేషన్ ఊసే ఎత్తలేదు. అంతేకాదు.. ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ (Kapu Corporation) ఏర్పాటు చేసి భారీగా నిధులు ఇస్తానని కూడా జగన్ మాటిచ్చారు. ‘అటు రిజర్వేషన్ లేదు.. ఇటు నిధుల్లేవ్..’ దీంతో కాపులంతా వైసీపీపై ఓ రేంజ్‌లో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి ఆహ్వానం రావడం, ఈయన కూడా దాదాపు కండువా కప్పుకుని.. ఎంపీగా కూడా పోటీచేయాలని భావిస్తుండటంతో.. ‘పాత రోజులు మరిచిపోతే ఎలా ముద్రగడా.. ఇంత నమ్మకద్రోహం చేశాక కూడా ఎందుకీ సాహసం’ అని సొంత సామాజిక వర్గం ప్రశ్నిస్తోందట. అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ నెరవేర్చని జగన్ చెంతకు ముద్రగడ ఎలా పోతారన్నది కాపుల నుంచి సర్వత్రా వస్తున్న ప్రశ్న. మరోవైపు నాడు మెగా ఫ్యామిలీని ముద్రగడ తిట్టిపోసిన మాటలను కూడా కాపు నేతలు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. అప్పట్లో అంతలా ఎగిరెగిరి పడిన ముద్రగడ ఇలా యూటర్న్ తీసుకోవడమేంటి..? అని మెగాభిమానులు కన్నెర్రజేస్తున్నారు.

Jagan-and-Mudragada.jpg

మొత్తానికి చూస్తే.. కాపు ఓటు బ్యాంక్ కోసం జగన్ తెగ తాపత్రయపడుతున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముద్రగడ కోసం ఇంత తంటాలు పడుతున్న జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల అభివృద్ధికి ఏమైనా చేసుంటే బాగుండేదనే అభిప్రాయం సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే వస్తోందట. వైసీపీ ప్రభుత్వం కాపులను పట్టించుకోలేదని.. ఇకనైనా సర్కార్ కళ్లు తెరవాలని ముద్రగడతో పాటు పలువురు నేతలు లేఖలు రాసిన, మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. 5 శాతం రిజర్వేషన్లు, కార్పొరేషన్‌కు ఎలాంటి నిధులు ఇవ్వకపోయినా ఫర్లేదని.. మాటిచ్చి మడమతిప్పిన జగన్‌ సమక్షంలోనే ముద్రగడ వైసీపీ కండువా కప్పేసుకుంటారా..? లేకుంటే ఇన్నిరోజులు తన వెనకున్న కాపులకు న్యాయం చేయడానికి మళ్లీ ఉద్యమబాట పడతారా..? అనేది ఉద్యమనేతకే తెలియాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Ponguleti and Jupally : క్లైమాక్స్‌కు చేరుకున్న కాంగ్రెస్‌లో చేరికలు.. నిన్న సాయంత్రం బెంగళూరులో.. ఇవాళ కోమటిరెడ్డి ఇంట్లో కీలక భేటీలు.. ఫైనల్‌గా..!


******************************

CBN Vs KCR : కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ రె‘ఢీ’.. గట్టిగానే ప్లాన్ చేశారుగా..!

******************************

BRS Vs Congress : తెలంగాణలో మారిపోతున్న పాలిటిక్స్.. కాంగ్రెస్‌లో చేరికపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. మరో అసంతృప్త నేత కూడా..

******************************

TS BJP : హస్తినలో బిజిబిజీగా ఈటల రాజేందర్‌.. హైకమాండ్ ఇచ్చే కీలక పదవి ఇదే..?

******************************

Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

******************************

TS BJP : హమ్మయ్యా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు, బీఆర్ఎస్‌‌తో సంబంధాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది..!


*****************************

Updated Date - 2023-06-12T18:41:37+05:30 IST