CBN Vs KCR : కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ రె‘ఢీ’.. గట్టిగానే ప్లాన్ చేశారుగా..!

ABN , First Publish Date - 2023-06-10T21:57:58+05:30 IST

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు (Kalvakuntla Chandrashekar Rao).. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రిటర్న్ గిఫ్ట్ (Return Gift) రెడీ చేశారా..?

CBN Vs KCR : కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ రె‘ఢీ’.. గట్టిగానే ప్లాన్ చేశారుగా..!

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు (Kalvakuntla Chandrashekar Rao).. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రిటర్న్ గిఫ్ట్ (Return Gift) రెడీ చేశారా..? గతంలో గిఫ్ట్ రాజకీయాలు (Gift Politics) చేసిన గులాబీ బాస్‌కు.. తిరిగిచ్చేయాలని బాబు ఫిక్స్ అయ్యారా..? ఇందుకు ఇప్పటికే వ్యూహరచన కూడా చేసేశారా..? పక్కా ప్లాన్‌తోనే చంద్రబాబు అడుగులు ముందుకేస్తున్నారా..? గతంలో ఏపీలో టీడీపీ (Telugudesam) ఓటమికి ప్రధాన పాత్ర పోషించిన కేసీఆర్‌కు (KCR) కచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవే అక్షరాలా నిజమేనని అర్థమవుతోంది. ఇంతకీ చంద్రబాబు వ్యూహమేంటి..? బాబు ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్‌గా కేసీఆర్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Retun-Gift.jpg

ఇదీ రిటర్న్ గిఫ్ట్ కథ..!

తెలంగాణలో రాజకీయాలు (TS Politics) హీటెక్కాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో.. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరెప్పుడు ఎటు జంప్ అవుతారో తెలియని పరిస్థితి. మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టి చూపిస్తామని బీఆర్ఎస్ (BRS) ధీమా వ్యక్తం చేస్తుండగా.. మూడోసారి కేసీఆర్ సీఎం సీటును కూడా టచ్ చేయనివ్వమని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శపథం చేస్తున్నాయి. కర్ణాటకలో (Karnataka) ఊహకందని రీతిలో గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో (Congress) ఎనలేని జోష్ వచ్చింది. ఇప్పుడు అదే జోష్‌తో తెలంగాణలో కూడా పాగా వేయాలని హస్తం పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. సరిగ్గా ఈ టైమ్‌లో తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు (NCBN) అడుగుపెట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశంకు పునర్‌వైభవం తీసుకురావాలని.. బాబు కృషిచేస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ టార్గెట్‌గా తెలంగాణలో ‘మహాకూటమి’ (Mahakutami) ఏర్పాటు చేసి చంద్రబాబు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే కూటమి పెద్గా వర్కవుట్ అవ్వలేదు. దీంతో గులాబీ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయోత్సవ వేడుకల్లో కేసీఆర్.. చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టిన సీబీఎన్‌కు ఏపీలోనే రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో వైసీపీకి (YSR Congress) , వైఎస్ జగన్ రెడ్డికి (YS Jagan Reddy) ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్ మద్దతిచ్చిన విషయం జగమెరిగిన సత్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ ఓటమిలో కేసీఆర్ కీలక పాత్రే పోషించారని చెప్పుకోవచ్చు.

KCR-and-jagan-ncbn.jpg

రిటర్న్ గిఫ్ట్ ఎలాగంటే..?

సీన్ కట్ చేస్తే.. గత ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్‌కు ఇప్పుడు తిరిగిచ్చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. పొత్తులతో వెళ్తేనే అటు ఏపీలో వైసీపీకి.. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్‌కు కళ్లెం వేయొచ్చన్నది చంద్రబాబు ప్లానట. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పొత్తుపై క్లియర్‌కట్‌గా మాట్లాడుకున్నారని తెలుస్తోంది. పొత్తు అనే మాట అనగానే బీజేపీ పెద్దలు కూడా రెడీ అని చెప్పేశారట. ఎందుకంటే శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లుగా చంద్రబాబుకు శత్రువైన కేసీఆర్‌ను గద్దె దించాలన్నది బీజేపీ వ్యూహం.. అందుకే చిన్నపాటి అవకాశం వచ్చినా దాన్ని సువర్ణావకాశంగా చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీచేసేందుకు బీజేపీ సిద్ధమైపోయినట్లుగా తెలుస్తోంది. ఇది వీలుకాని పక్షంలో కాంగ్రెస్‌తో కలవడానికి కూడా చంద్రబాబు ఏ మాత్రం వెనకడుగు వేయరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే.. ఫైనల్‌గా ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కేసీఆర్‌ను ఓడించాలన్నదే చంద్రబాబు టార్గెట్ అన్నమాట.

BJP-And-TDP.jpg

బాబు ప్లాన్ ఇదీ..?

తెలంగాణలో ఎక్కడిక్కడ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తుండటం.. నెలలో కనీసం రెండు మూడ్రోజులైనా తెలంగాణ నేతలతో సమావేశం కావడంతో బాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా.. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను (NTR Sata Jayanthi Utsavalu) ఘనంగా నిర్వహించి.. కేసీఆర్‌కు పరోక్షంగా టీడీపీ ఇచ్చే సంకేతాలివేనని తెలుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ (Hyderabad) , ఉమ్మడి ఖమ్మం (Khammam) , నిజామాబాద్ (Nizamabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో టీడీపీ ఇప్పటికీ ఉంది. నేతలు పార్టీలు మారారేమో కానీ క్యాడర్ మాత్రం స్ట్రాంగ్‌గానే ఉంది. దీనికి తోడు గత ఎన్నికలతో పోలిస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ భారీగానే పుంజుకుంది. ఈ పరిస్థితుల్లో టీడీపీకి బీజేపీ (TDP-BJP) బలం తోడైతే.. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయడం పెద్ద విషయమేమీ కాదు..!. మరోవైపు.. కాంగ్రెస్, వైఎస్సార్టీపీ (YSRTP) , తెలంగాణ జనసమితి (Telangana Jana Samithi) కూడా కలిసే పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక టీడీపీ-బీజేపీ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే కథ వేరేగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది..? రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరాల్సిందేనని ఫిక్స్ అయిన చంద్రబాబు ఏ మేరకు సక్సెస్ అవుతారు..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

BRS.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

BRS Vs Congress : తెలంగాణలో మారిపోతున్న పాలిటిక్స్.. కాంగ్రెస్‌లో చేరికపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. మరో అసంతృప్త నేత కూడా..

******************************

TS BJP : హస్తినలో బిజిబిజీగా ఈటల రాజేందర్‌.. హైకమాండ్ ఇచ్చే కీలక పదవి ఇదే..?

******************************

Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

******************************

Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

******************************

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

******************************

YS Viveka Murder Case : భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌లో కీలక అంశాలు ప్రస్తావించిన సీబీఐ.. ఇదేగానీ జరిగితే..

******************************

Updated Date - 2023-06-10T22:05:59+05:30 IST