YS Viveka Murder Case : భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌లో కీలక అంశాలు ప్రస్తావించిన సీబీఐ.. ఇదేగానీ జరిగితే..

ABN , First Publish Date - 2023-06-09T19:05:34+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను (Bhaskar Reddy Bail Petition) సీబీఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

YS Viveka Murder Case : భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌లో కీలక అంశాలు ప్రస్తావించిన సీబీఐ.. ఇదేగానీ జరిగితే..

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను (Bhaskar Reddy Bail Petition) సీబీఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటరులో పలు కీలక అంశాలు సీబీఐ ప్రస్తావించింది.

9Bhaskar-Reddy-At-CBI-offic.jpg

సీబీఐ ప్రస్తావించిన అంశాలు ఇవీ..

  • వివేకా హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎనిమిదో నిందితుడు (A8) : సీబీఐ

  • కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉంది

  • దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీకుమారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు

  • వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు కొనసాగుతోంది

  • ఎన్.శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ రెడ్డి హత్యస్థలికి చేరారు

  • ఉదయం 5:20 గంటలకు ముందే అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు

  • కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్, శివశంకర్ రెడ్డి చెప్పారు

  • సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు

  • దస్తగిరిని ప్రలోభపెట్టేందుకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు : సీబీఐ

    CBI.jpg

    బెయిల్ ఇవ్వొద్దు..

  • వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోరిన వివేకా కుమార్తె సునీత

  • సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించిన సునీత

  • వివేకా హత్య కేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది

  • భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారు

  • భాస్కర్‌రెడ్డి ప్రమేయంపై పలువురు సాక్షుల వాంగ్మూలాలు ప్రస్తావించిన సునీత

Sunitha-Reddy.jpg

భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే..

  • భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారు: సీబీఐ

  • కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి

  • అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్‌రెడ్డి బలానికి నిదర్శనం

  • భాస్కర్‌రెడ్డి బయట ఉంటే చాలు.. పులివెందుల సాక్షుల ప్రభావితమైనట్లే

  • భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే

  • సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టం

  • దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధం

  • కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్‌రెడ్డిపై గతంలో మూడు కేసులున్నాయి

  • పేలుడు పదార్థాల చట్టం సహా మూడు కేసులు గతంలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు

  • రెండు కేసులు వీగిపోగా.. మరొకటి తప్పు కేసుగా తేల్చి కొట్టివేశారు

  • కేసుల ప్రకారం భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది

  • వివేకా హత్యలో ప్రమేయాన్ని చూసినా.. భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకమే

  • ఏప్రిల్- 16 నుంచి జైల్‌లో ఉన్నంత మాత్రాన బెయిల్‌‌కు కారణం కారాదు

  • వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6:15 గంటలకు ముందే తెలుసునని పునరుద్ఘాటించిన సీబీఐ

  • వివేకా పీఏ బయటకు చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తింపు: సీబీఐ

Updated Date - 2023-06-09T19:09:48+05:30 IST