Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-06-09T21:12:05+05:30 IST

హైదరాబాద్ సంచలనమైన శంషాబాద్ అప్సర హత్యకేసుకు (Apsara Murder Case) సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు (Police) సేకరించారు..

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

హైదరాబాద్ సంచలనమైన శంషాబాద్ అప్సర హత్యకేసుకు (Apsara Murder Case) సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు (Police) సేకరించారు. సుదీర్ఘ విచారణ తర్వాత అప్సర హత్యకు వివాహేతర సంబంధం కారణమని పోలీసులు తేల్చారు. ఘటన ఎలా జరిగింది..? ఫిర్యాదు ఎవరు చేశారు..? ఈ మొత్తం వ్యవహారం బయటికెళ్లా వచ్చిందనే విషయాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి (Shamshabad DCP Narayana Reddy) మీడియా మీట్ పెట్టి వెల్లడించారు. ‘జూన్-05న సాయి కృష్ణ.. అప్సర మిస్ అయిందని మిస్సింగ్‌గా (Apsara Missing) ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు సాయితో పాటు మరో మహిళ కూడా ఉన్నారు. అప్సరను జూన్-3న భద్రాచలం వెళ్లేందుకు వాహనం ఎక్కించాం. ఆమె నుంచి స్పందన లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని ఫిర్యాదులో ఇద్దరూ చెప్పారు. సాయితోపాటు వచ్చిన మహిళ అప్సర తల్లి అని మేం గుర్తించాం. అయితే ఫిర్యాదు సమయంలో ఇద్దరూ మాటలకు పొంతన లేదు. దీంతో మాకు అనుమానం వచ్చింది. సైంటిఫిక్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్‌ ట్రాకింగ్‌ కేసు ట్రేస్ చేశాం. హత్యకంటే ముందు ఇద్దరు కారులో తిరిగినట్లు గుర్తించాం. మృతురాలు, నిందితుడు ఇద్దరూ కల్సి ఉన్న ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నాం. కారు ముందు సీటులో పడుకున్న అప్సరను గమనించిన సాయి కృష్ణ (Apsara- Sai Krishna) కారు కవర్‌తో ఊపిరాడకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. అప్సర ప్రతిఘటించడంతో కారులో ఉన్న బెల్లం దంచే కర్రతో బలంగా కొట్టాడు. అతడు పూజారి కావడంతో ప్రసాదం కోసం బెల్లం దంచే కర్ర ఉంది. బలంగా దాడి చేయడంతో తీవ్ర రక్త స్రావమై అప్సర అక్కడికక్కడే చనిపోయింది. డెడ్ బాడీని మ్యాన్ హోల్లో వేసి ఇసుక సిమెంట్‌తో ప్యాక్ చేశారు. రెండు లారీల ఇసుకను ఇద్దరి సహాయంతో తెప్పించాడు’ అని డీసీపీ మీడియాకు వెల్లడించారు.

Apsara-And-Sai-Final.jpg

పరిచయం.. హత్య ఇలా..!

సీరియల్‌లో (Serials) నటించాలని చెన్నై నుంచి అప్సర హైదరాబాద్‌కు వచ్చింది. 2022లో హైదరాబాద్ (Hyderabad) వచ్చి ఇక్కడే స్థిరపడింది. అప్సర తన సోదరి వద్ద ఉంటూ ప్రయత్నాలు చేస్తుండేది. డిగ్రీ పూర్తి చేసిన అప్సర కొద్దిరోజులు సినీ రంగంలో పనిచేసింది. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. సాయికృష్ణది కోనసీమ జిల్లా గన్నవరం. మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన సాయి.. 2010లో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా ఉంటూనే.. బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరికీ ఎలాంటి బంధుత్వం లేదు. ఒక్కటే కమ్యూనిటీ మాత్రమే. అప్సర బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అలా అప్సరతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. అయితే.. సాయికి పెళ్లయినట్లు అప్సరకు ఈ మధ్యే తెలిసింది. దీంతో.. పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై అప్సర ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేశాడు. హత్యను మిస్సింగ్ కేసుగా చిత్రీకరించాలని సాయి ప్లాన్ చేశాడు. సాయి కృష్ణ పరువు ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో హత్య చేశాడు. అప్సర గతంలో గర్భం దాల్చింది. అప్సరకు అబార్షన్ కూడా అయిందని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ విషయంలోనే మరింత లోతుగా విచారణ జరుపుతున్నాం. నిందితుడుని పోలీస్‌ కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారణ చేస్తున్నాం. అప్సర కోయంబత్తూరు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి సాయికృష్ణతో వెళ్లింది. సాయికృష్ణ ఆమెను శంషాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తిప్పి సుల్తాన్‌పుర్‌ తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తు తేలిందిఅని డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.

Apsara-and-Sai-Krishna.jpg

హత్యకేసులో కొత్త కోణం..

ఈ కేసులో తాజాగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. అప్సరను హత్య చేసేందుకు సాయికృష్ణ నాలుగు సార్లు ప్రయత్నం చేశాడని పోలీసు విచారణ తేలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న అప్సరను హత్య చేసి వదిలించుకునేందుకు సాయి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గతంలో నాలుగు సార్లు హత్యాప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ఐదోసారి జూన్-03న అప్సరను తీసుకుని శంషాబాద్‌కు వెళ్లాడు. అక్కడ నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి పక్కా ప్లాన్ ప్రకారమే హతమార్చాడు. అనంతరం సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పడేశాడు. సాయి కృష్ణపై అనుమానం వచ్చి పోలీసులు కస్టడీలో పెట్టుకున్నారు. అయితే.. సరూర్‌నగర్‌లో మూడ్రోజులపాటు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధానార్చకుడిగా సాయి పూజలు చేశాడు. అయితే.. బొడ్రాయి కార్యక్రమం ఉందని సాయిను వదిలి పెట్టాలని ఓ మంత్రి పీఏ ,అధికార పార్టీ నేత పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేశాడు. సాయిని పోలీస్ కస్టడీ నుంచి పూచి కత్తులతో పోలీసులు వదిలిపెట్టారు. ఈ బొడ్రాయి కార్యక్రమం కోసం జూన్ 6, 7, 8 తేదీల్లో సాయి పూజలు చేశాడు. జూన్-8న సాయంత్రం తిరిగి పోలీస్ స్టేషన్‌లో సాయి లొంగిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిన స్థలాన్ని నిందితుడు చూపించాడు. ఆ రాత్రి సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ (Scene Re-construction) చేసి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.

Apsara-Photos.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

******************************

Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

******************************

Updated Date - 2023-06-09T21:18:12+05:30 IST